Politics

తెదేపాకు తోట టాటా

Thota Trimurthulu Bids Farewell To TeluguDesam

తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత తోట త్రిమూర్తులు శుక్రవారం టీడీపీకి రాజీనామా చేశారు. ఇవాళ రామచంద్రాపురంలో ఏర్పాటు చేసి కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. కార్యకర్తల సహకారం మరిచిపోలేనిదన్న తోట త్రిమూర్తులు.. గెలుపు, ఓటములకు సంబంధం లేకుండా తాను ప్రజల మనసును గెలుచుకున్నానని అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న టీడీపీలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు వైఖరివల్లే తోట త్రిమూర్తులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.