చిట్టి బుజ్జాయిలు పెద్దయ్యాక ఎలాంటి పదాలను ఉపయోగిస్తారో, ఎలాంటి భాషా నైపుణ్యాలను పెంపొందించుకుంటారో ఏడాది వయసున్నప్పుడే అంచనా వేయొచ్చట! షెఫీల్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తాజాగా దీనిపై అధ్యయనం చేశారు. 11-12 నెలల వయసు బుడతలు… తల్లిదండ్రుల వైపు, వస్తువుల వైపు చూడటం; రకరకాల హావభావాలను ప్రదర్శించడం; రకరకాల శబ్దాలు వినిపించడం చేస్తుంటారు. ఇవన్నీ వారి మనసులో మాటలేనని అంటున్నారు… ప్రధాన పరిశోధకుడు ఎడ్ డొనెలాన్. అయితే ఆ సమయంలో తల్లిదండ్రులు వారికి సమాధానమివ్వడం ముఖ్యమట. అలా వారు చెప్పే మాటలనే పిల్లలు నేర్చుకుంటారని, ఇవి వారి భవిష్యత్ భాషా నైపుణ్యాలకు పునాది అవుతాయని డొనెలాన్ వివరించారు.
ఏడాది వయసులో మాటలే రేపటి మూటలు
Related tags :