WorldWonders

బేగంపేటలో బట్టల పోరాటం

Begumpet St.Francis Students Protest Against Dress Code

బేగంపేట్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. డ్రెస్ విషయంలో కాలేజ్ ప్రిన్సిపల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో.. విద్యార్థులు ధర్నాకు దిగారు. మోకాళ్ళ పైకి డ్రెస్ వేసుకొస్తే కాలేజ్ లోకి అనుమతించనని ప్రిన్సిపల్ అన్నారని చెబుతున్నారు స్టూడెంట్స్. అలాంటి డ్రెస్సులు వేసుకోవడం వలన పెళ్ళిళ్ళు కావని ప్రిన్సిపల్ అన్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. మరోవైపు డ్రెస్ కోడ్ పాటించని కొందరు విద్యార్థులను ఉమెన్ సెక్యూరిటి కాలేజ్ లోనికి రానివ్వలేదు.దీంతో యుజి, పీజీ విద్యార్థినులు కాలేజ్ గేట్ ముందు భైఠాయించి నిరసన చేపట్టారు. కాలేజ్ వారు పెట్టిన రూల్స్ మార్చకపోతే నిరసనలు ఉదృతం చేస్తామంటున్నారు స్టూడెంట్స్. ఇంత జరుగుతున్నా మేనేజేమెంట్ ఏమాత్రం స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.