బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తాను రెండుసార్లు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు తెలిపింది. ఓసారి ఓ దర్శకుడు కిస్సింగ్ సీన్‌ను అతడితో రిహార్సల్స్ చేయమన్నాడని పేర్కొంది. ఇండస్ట్రీలో అప్పుడే అగుపెట్టడంతో అతడి మాటలకు విస్తుపోయానని పేర్కొంది. అయితే, ముద్దు సీన్ కోసం రిహార్సల్స్ చేయబోనని అతడి ముఖం మీదే చెప్పేశానని తెలిపింది. మరోసారి మరో వ్యక్తి ‘స్నేహితులకు మించి ఉందామని’ అన్నాడని, తాను ‘ఎస్’ అంటే తన కోసం ప్రాజెక్టులు వెతుకుతానని, మరిన్ని అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చాడని జరీన్ ఖాన్ గుర్తు చేసుకుంది. అయితే, ఇందుకు కూడా తాను నో చెప్పినట్టు వివరించింది.
ముద్దు సీన్ రిహార్సిల్ అన్నాడు
Related tags :