Agriculture

తెలంగాణాలో బాగా తగ్గిన నిమ్మకాయ దిగుబడి

Lemon Yield Drops In Telangana Increasing Prices Per Dozen

వినాయక నిమజ్జనం వరకు ఽసాధారణంగానే ఉన్న నిమ్మకాయల ధరలు శుక్రవారం నుంచి అకస్మాత్తుగా రెట్టింపయ్యాయి. దీంతో కొనుగోళ్లు బాగా తగ్గాయి. ఇటీవల వెయ్యి నుంచి పదిహేను వందలు పలికిన నిమ్మకాయల బస్తా రెండు రోజుల నుంచి రెండు వేల నుంచి మూడున్నర వేలు పలుకుతోంది. ఇటీవల డజన్‌ నిమ్మకాయలు ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు పలుకగా ప్రస్తుతం 40 నుంచి 60 రూపాయలు పలుకుతున్నాయి. దీంతో నిమ్మకాయాలు కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజూ అయిదారు బస్తాల నిమ్మకాయలు అమ్మే వారిమి అని రెండు రోజుల నుంచి రెండు బస్తాలకు మించి అమ్మలేకపోతున్నామని నరేష్‌ అనే వ్యాపారి తెలిపాడు. నిమ్మకాయాలు ప్రతి రోజూ నల్గొండ నుంచి నగరంలోని చాదర్‌ఘాట్‌, దారుల్‌షిఫా మార్కెట్‌కు వస్తుంటాయి. ప్రతి రోజూ పది నుంచి ఇరవై బస్తాల నిమ్మకాయలను మార్కెట్‌కు తరలించే వారు. దిగుబడి తగ్గడంతో ప్రస్తుతం అయిదు బస్తాల కంటే ఎక్కువ రావడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో ధర ఎక్కువ పలుకుతోన్నాయని వ్యాపారులు తెలిపారు.