Politics

కోడెలకు బాబు నివాళి

కోడెలకు బాబు నివాళి-Chandrababu pays tribute to kodela

గుంటూరు పార్టీ కార్యాలయంలో తెదేపా సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు మృతికి చంద్రబాబు నివాళులర్పించారు.

పార్టీ జెండాను అవనతం చేసి సంతాపం ప్రకటించారు, నేతలంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఒక వైద్యునిగా, రాజకీయ నాయకునిగా కోడెల ప్రస్థానం విశిష్టమైనదని చంద్రబాబు కొనియాడారు.

కోడెల లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని, వారి మరణంతో ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని, వ్యక్తిగతంగా, పార్టీ పరంగా కోడెల శివప్రసాద్ మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేసారు.

అధికార పార్టీ రాజకీయ కుట్రలకు వేధింపులకు పరాకాష్ట కోడెల శివప్రసాద్ బలవన్మరణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.