Politics

కోడెల అంతిమయాత్ర వార్తావిశేషాలు-TNI ప్రత్యేకం

Kodela Sivaprasad Final Journey

గుంటూరు టీడీపీ ఆఫీసుకు కోడెల భౌతికకాయాన్ని తరలించారు. అభిమానుల సందర్శనార్ధం పార్టీ ఆఫీసులో కోడెల పార్థివదేహాన్ని ఉంచారు. దీంతో టీడీపీ ఆఫీసుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. కాసేపట్లో నరసరావుపేట వరకు కోడెల అంతిమయాత్ర నిర్వహించనున్నారు. పేరేచర్ల, మేడికొండూరు, కొర్రపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట వరకు కోడెల అంతిమయాత్ర నిర్వహిస్తారు. బుధవారం నరసరావుపేటలో అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు జరగనున్నాయి.
############
ఇబ్రహీంపట్నంలో అంతిమయాత్ర వాహనం ఎక్కిన కోడెల కుమారుడు శివరాం
############
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు మృతి కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. కోడెల పర్సనల్‌ ఫోన్‌ మిస్సైనట్టు పోలీసులు గుర్తించారు. కోడెల చివరిగా 24 నిమిషాల పాటు ఫోన్‌ కాల్‌ మాట్లాడినట్టు దర్యాప్తులో తెలిసింది. సోమవారం సాయంత్రం 5గంటల తర్వాత ఫోన్‌ స్విచాఫ్‌ అయినట్లు సమాచారం. కోడెల కాల్‌ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.

సోమవారం ఉదయం ఎప్పటిలాగే దినచర్య ప్రారంభించిన కోడెల.. ఉదయం 8.30 గంటల సమయంలో ఒకరితో ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 20 నిమిషాలకు పైగా ఫోన్‌లో మాట్లాడినట్లు కాల్‌ రికార్డులో గుర్తించినట్లు తెలిపారు. అయితే, ఆ వ్యక్తి ఎవరు? ఆయనతో ఏం మాట్లాడారనేది తదుపరి దర్యాప్తులో తేలుతుందన్నారు. కోడెల ఫోన్‌ ఇన్‌కమింగ్‌, ఔట్‌ గోయింగ్‌ కాల్స్‌ వివరాలు సేకరిస్తున్నామని, ఎస్‌ఎంఎస్‌ల్నీ పరిశీలిస్తున్నట్లు పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు.
############
పనివాళ్ల నుంచి వాంగ్మూలం తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు..

పోస్టుమార్టం నివేదికలో కోడెలది ఆత్మహత్య అని తేలడంతో తెలంగాణ పోలీసులు ఆయన నివాసానికి మరోసారి వెళ్లారు..

కోడెల కుటుంబ సభ్యుల నుంచి బంజారాహిల్స్ ఏసీపీ మరిన్ని వివరాలు సేకరించారు..

ఘటనాస్థలంలో క్లూస్, ఫింగర్ ప్రింట్స్ బృందాలు పలు ఆధారాలు సేకరించాయి..

పోలీసులు కోడెల ఇంట్లో పనివాళ్లను కూడా స్టేషన్ కు తీసుకెళ్లారు..

వ్యక్తిగత డ్రైవర్, గన్ మెన్ తో పాటు పనివాళ్లను కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించి వాంగ్మూలం తీసుకున్నారు..

స్టేట్ మెంట్ రికార్డ్ ప్రక్రియ పూర్తయిన పిమ్మట వారిని తిరిగి ఇంటికి పంపించనున్నారు.
############
43వేల కోట్లు దోచుకుని కేసులు పెడతారా: చంద్రబాబు ఫైర్..!!  

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు మృతికి ప్రభుత్వ వేధింపులే కారణమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వం ఉన్మాదిలా వ్యవహరిస్తోందని… కోడెల మృతిపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.

కోడెలలాంటి వ్యక్తికి ఇలాంటి ముగింపు రావడం బాధాకరమన్నారు.

కేసులు, వేధింపులతో కోడెల కుటుంబాన్ని చెల్లాచెదురుచేశారని..

కోడెల తప్పు చేసి చనిపోలేదు, వేధింపులకు గురై చనిపోయారని చంద్రబాబు పేర్కొన్నారు.

దేశ చరిత్రలో ఓ సీనియర్‌ నేత ఆత్మహత్య చేసుకోవడం ఇదే తొలిసారి అని చెప్పుకొచ్చారు.

రూ.43వేల కోట్లు దోచుకుని, 11 చార్జిషీట్లలో ముద్దాయిగా ఉన్న లక్ష రూపాయాల ఫర్నీచర్ కోసం కోడెల
మీద కేసు పెడతారా అని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వానికి పోలీసులు.. ఆలిండియా సర్వీస్‌ ఉద్యోగులు సరెండర్‌ అయ్యారని చంద్రబాబు ఆరోపించారు.
############
కోడెల ఆత్మహత్య కేసుల వల్ల కాదు.. చంద్రబాబు దూరం పెట్టడం వల్లే…

ఏపీ మంత్రి కొడాలి నాని

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ది రాజకీయ హత్య అని ఆరోపించారు ఏపీ మంత్రి కొడాలి నాని.

తనను నమ్ముకొన్న పార్టీ, అధినేత దూరం పెట్టడంతో అవమానంతో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.

కోడెల శివప్రసాద్‌ను ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని 3 నెలలో ఎందుకు చంద్రబాబు మీడియా ముఖంగా చెప్పలేదని ప్రశ్నించారు.

కోడెల, అతని కుమారుడు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మీపై కేసు పెట్టింది బాధితులేనని స్పష్టంచేశారు.

ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ కేసులు నమోదు చేయలేదని తేల్చిచెప్పారు.

ఎప్పుడు మీ వెన్నంటే ఉన్న కోడెలను మీరు దారుణంగా అవమానించారని తెలిపారు.

పార్టీలో కొందరి చేత కోడెల శివప్రసాద్ తప్పుచేశారని మాట్లాడించారని ఆరోపించారు.

వర్ల రామయ్య లాంటి వ్యక్తులతో పార్టీ కార్యాలయంలో మాట్లాడించి .. కోడెలను ఒంటరి చేసింది మీరు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు కొడాలి నాని.

అంతేకాదు శాసనసభ ఫర్నీచర్‌కు సంబంధించి ఏ చర్య తీసుకున్నా తాము కాదనబోమని ఓ పత్రికలో చంద్రబాబు పేరుతో వచ్చిన వార్తను చదివి వినిపించారు కొడాలి నాని.

కోడెల శివప్రసాద్‌ను చంద్రబాబు దారుణంగా అవమానించారు.

అందుకోసమే ఆయన అవమాన భారాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు.
############
నరసరావుపేటలో144సెక్షన్ పై యనమల ఆగ్రహం….

కోడెల మరణం వెనుక వైసిపి నేతల కుట్ర ఉంది

వైసిపి నేతలు, ప్రభుత్వం, పోలీసులు, సాక్షి మీడియానే కోడెల చావుకు కారణం.

క్రిమినల్ లా కింద వాళ్లపై కుట్రదారులుగా నమోదు చేయాలి

చనిపోయాక కూడా కోడెల మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లనీకుండా చేస్తారా..

144సెక్షన్ పెట్టి నాయకుల పార్ధివ దేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లనివ్వక పోవడం దేశంలో ఎక్కడా జరగలేదు

మంత్రి బొత్స వ్యాఖ్యలను బట్టే దీనిని హత్య కేసు కింద నమోదు చేయాలి.

విదేశాల్లో ఉన్న కొడుకే చంపాడని వైసిపి నేత సాయి తో ఫిర్యాదు చేయించారు

బొత్స వ్యాఖ్యలు, సాయి ఫిర్యాదు కలిపి చూస్తే రెండూ ఒకే రకంగా ఉన్నాయి, వైసిపి నేతల కుట్రను ఇవన్నీ బహిర్గతం చేస్తున్నాయి.

కోడెల ఆత్మహత్యకు వీళ్లంతా ప్రేరేపించారు.

వీళ్లందరిపై భారతీయ నేర శిక్షాస్మృతి కింద కేసులు పెట్టాలి.

ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం ఇది ఆత్మహత్యే అని ధ్రువీకరించారు.

ఈ నివేదికపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఏమంటారు…?

వైసిపి నేతలు ఫోరెన్సిక్ రిపోర్ట్ పై ఏమంటారు..?

27ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న, 37ఏళ్ల రాజకీయ జీవితం గడిపిన కోడెల ప్రాణాలను వైసిపి ప్రభుత్వం, వైసిపి నేతలే బలి తీసుకున్నారు.

ఆయన బలవన్మరణానికి వైసిపి నేతలే బాధ్యత వహించాలి

తక్షణమే నరసరావుపేటలో నిషేధాజ్ఞలు తొలగించాలి.

ఒక మహా నాయకుడి పార్ధివ దేహానికి ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు గొప్ప వీడ్కోలు పలికేందుకు ప్రభుత్వం అడ్డుపడకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి
############
పార్టీ చీఫ్ విప్ శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్…

జీ శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్..

మాజీ స్పీకర్ కోడెల మరణం బాధాకరం..

ఆయన కుటంబ సభ్యులకు మా సానుభూతి తెలియజేస్తున్నాము..

మాకు శవ రాజకీయాలు తెలియదు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోడెల మృతదేహం పక్కన మాట్లాడుతుంటే అసలు మనిసేన అనే అనుమానం కలుగుతోంది..

కోడెల బ్రతికి ఉన్నప్పుడు హింసిస్తారు.. చనిపోయిన తర్వాత శవ రాజకీయాలు చేస్తారు..

ఎన్టీఆర్ బతికి ఉన్న సమయంలోను మానసిక వేదనకు గురిచేసి ఆయన శవం పక్కన రాజకీయాలు చేశారు..

హరికృష్ణ, లాల్ జాన్ బాషా విషయంలో చంద్రబాబు అలానే చేశారు

బతికి ఉండగా కోడెలను మానసిక వేదనకు గురిచేశారు..

కోడెల గతంలో ఆత్మహత్య ప్రయత్నం చేస్తే కనీసం చంద్రబాబు పరామర్శించలేదు..

శవ రాజకీయాలతో ప్రజల్ని రెచ్చకొట్టే ప్రయత్నం చేస్తున్నారు..

గతంలో వర్ల రామయ్య కోడెలపై తీవ్ర విమర్శలు చేసారు..

కోడెల వలన పార్టీ భ్రష్టు పట్టి పోయిందని వర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు..

కోడెల ఫర్నిచర్ దొంగలించడం తప్పుని వర్ల రామయ్య మాట్లాడారు..

కోడెల ఆత్మహత్య పై అనేక రకాలుగా మాట్లాడుతున్నారు..

ఒకరు తాడుతో అంటే మరొకరు లుంగితో అని మందు వికటించనందు వల్ల అని ఇంకొకరు గుండెపోటు అని మాట్లాడుతున్నారు..

కోడెల ఆత్మహత్యకు వైస్సార్సీపీకి ఏమి సంబంధం..

కోడెలపై కేసులు పెట్టింది టీడీపీ నాయకులే..

వైస్సార్సీపీ నాయకులను నరికి చంపిన ఘనత టీడీపీది..

శవ యాత్రలు శవ రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజం.

వైఎస్ రాజారెడ్డి, చెరుకులపాడు నారాయణరెడ్డిని చంపిన హంతకులను ఇంట్లో పెట్టుకున్న చరిత్ర చంద్రబాబుది..

కోడెల.. కొడుకు, కుమార్తె వలన చనిపోయారని వర్ల రామయ్య స్వయంగా తెలిపారు..ఇవిగో ఆధారాలు.

ఛలో ఆత్మకూరు చేపట్టినప్పుడు కోడెలను ఎందుకు చంద్రబాబు పిలవలేదు..

పార్టీ మీటింగ్ లకు కోడెలను చంద్రబాబు ఆహ్వానించలేదు..

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయకుండా కోడెల ఆత్మ గౌరవంను కించపరిచింది చంద్రబాబు కాదా..

చంద్రబాబు కళ్ళలో నుంచి నీళ్లు తెప్పించడానికి ఎల్లో మీడియా ఎంతో ప్రయత్నం చేస్తోంది..

అచ్చెన్నాయుడు ఉద్యోగులను యుజిలేస్ ఫెల్లో అంటే కేసు పెట్టారా..

టీడీపీ నేతలు దళితులను కులం పేరుతో తిడితే కేసు పెట్టారా..

చంద్రబాబు పద్ధతి మార్చుకోకపోతే చరిత్ర హీనుడుగా మిగిలిపోతావు..

కోడెల చనిపోయిన తరువాత ఐదు ఆరు గంటలకు వరకు చంద్రబాబు మాట్లాడలేదు..

చంద్రబాబు మానసిక క్షోభపై కోడెల ఏమైనా లెటర్ రాసా రు అని పదే పదే అడిగేవారు..

కోడెల ఎలాంటి లెటర్ రాయలేదని తెలిసిన తరువాత చంద్రబాబు రాజకీయ డ్రామా మొదలు పెట్టారు..

కోడెలను చంద్రబాబు మానసికంగా వేధించడం వలనే చనిపోయారు.
############