ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, పెళ్లి కాని
ఓ పదిమంది అబ్బాయిల్ని, అమ్మాయిల్ని ఆ ఇంట్లో రోజుల తరబడి ఉంచితే ఏమవుతుంది?
ఏదో ఒక రోజు పోలీసులు తలుపుకొడతారు, ఆ మరుసటి రోజు పేపర్లో “వ్యభిచార ముఠా గుట్టు రట్టు” అని వార్త వస్తుంది.
కానీ ఆ ఇంటికి బిగ్ బాస్ హౌస్ అని పేరుపెట్టి పెళ్లి కానీ అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఆ ఇంట్లో పెట్టి, సమాజానికి ఎందుకు పనికి రాని వాళ్ళు చేసే పనుల్ని రోజుకు రెండు గంటల చొప్పున టీవీల్లో ప్రసారం చేస్తే దాన్ని బిగ్ బాస్ షో అంటున్నారు.
రాబోవు తరాలని సహజీవనం అనే విష సంస్కృతి వైపు ఈడ్చుకెళ్లి, ఈ దేశ కుటుంబ వ్యవస్థల్ని బజారున పడేసే ఇట్లాంటి పనికి మాలిన “షో” ల నుండి మన పిల్లల్ని దూరంగా ఉంచుదాం
BIG BOSS. BIG BOSS
ఎవడీ BIG BOSS ?
ఎక్కడ నుండి వచ్చాడు ఈ BIG BOSS ?
ఎందుకు వచ్చాడు ఈ BIG BOSS ?
ఎవరి కోసం వచ్చాడు ఈ BIG BOSS ?
మన ఇంటికే ఎందుకు వచ్చాడు ఈ BIG BOSS ?
వీడి విష సంస్కృతి ఏమిటి ?
ప్రపంచంలోనే అద్భుతమైన , పటిష్టమైన కుటుంబ వ్వవస్ద కలిగిన వారు భారతీయులు .
విదేశీయులు సైతం మన కుటుంబ వ్వవస్ద ని ఆచరిస్తున్నారు / ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారు .
ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన మన భారతీయ కుటుంబ వ్వవస్దని సర్వనానం చేయడానికి వచ్చాడు ఈ *BIG BOSS .
బారత దేశంలో అన్ని మతాలవారు , అన్ని కులాల వారు సనాతనమైన , సమ్మతమైన , ఉత్తమమైన , పటిష్ట మైన మన కుటంబమైన వ్వవస్దని ఆచరిస్తున్నారు .
మీరందరూ మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ Big Boss ని సుమారుగా రెండు గంటలు కలిసి చూసి , ఆనందిస్తున్నారు .
మరి మీరు ఏ నాడైన ఆలోచించినారా?
మీ రెండు తరాలు సర్వనాశనం అయిపోతున్నాయి .
ఈ BIG BOSS లో పైళ్ళైయిన వారు / పెళ్ళికానివారు కొన్ని రోజులో ఒకే HOUSE లో కలిసి మెలసి , సహజీవనం చేస్తున్నారు.
ఈ సహజీవనం లో వీరు చేస్తున్న వెకిలి పనులు, అసహ్యకరంగా దుస్తులు , భంగిమలతో మనకు దర్సనమిస్తున్నారు.
మరి పెళ్ళయైన స్త్రీ / పురుషులు , పరాయి వాళ్ళతో ఎలా సహజీవనం చేస్తారు?
ఇదేనా మన భారతీయ సంస్కృతి , సాంప్రదాయం ?
ప్రతి రోజు ఎవరో ఒకరు ఘర్షణ పడటం , తర్వాత గట్టిగా కౌగలించు కోవడం , ఇదేనా మన సంస్కృతి?
ఎంత అసహ్యకరమైన వెకిలి చేష్టలు , వెర్రి పోకడలు.
ఇవన్నియు మనము మన కుటుంబ సభ్యులతో కలిసి చూస్తున్నాం.
మరి భవిష్యత్తులో మీ భార్య లేక మీ భర్త పరాయి వాళ్ళతో సహజీవనం చేస్తే భరిస్తారా / ఒప్పుకుంటారా?
మీ కొడుకు , కోడలు , బిడ్డ , అల్లుడు మొదలగు వారు పరాయి వాళ్ళతో కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు సహజీవనం చేస్తామంటారు , అనుమతిస్తారా?
యుక్త వయసులో వుండే మీ బిడ్డల మాటేంటి?
మీతో కలిసి చూస్తున్న మీ పిల్లలు కూడా భవిష్యత్తులో ఇతరులతో సహజీవనానికి ఒప్పుకుంటారా?
ఎలా చూస్తారండి ఈ దరిద్రపు Big Boss ని.
కాస్త ఆలోచించడి.
అందరూ చదువుకున్న వారే ,కాని కాస్త ఇంగిత జ్ఞానం కోల్పోయినారు.
మీరు చేస్తున్న తప్పుని తెలుసుకొండి.
మేలుకోండి
మీ కుటుంబాలని కాపాడుకోండి .
గత కొన్ని సంవత్సరాలుగా మన T. V. తెలుగు సీరియల్స్ మన కుటుంబ వ్వవస్దని చీల్చి చెండాడి నాయి / చెండాడు తున్నాయి . కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ , అనురాగాలు , అభిమానం , కరుణ మొదలగు నవి పూర్తిగా తగ్గిపోయినాయి .
విదేశి విష సంస్కృతి ని వెదజల్లే ఈ BIG BOSS ని చూస్తారా ?
BIG BOSS .హింసించడం లేదు, మన కుటుంబాలను నిట్ట నిలువునా, అతి కిరాతకంగా గొడ్డలితో నరుకుతున్నాడు .