కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్ విదేశాల నుంచి వచ్చారు. కెన్యా నుంచి ఈ ఉదయం ముంబయి చేరుకున్న ఆయన.. కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తున్న కోడెల పార్థివదేహం వద్దకు శివరామ్ బయల్దేరారు. తమ కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉందని.. ఈ పరిస్థితుల్లో తానేమీ మాట్లాడలేనని ఆయన చెప్పారు. మరోవైపు హైదరాబాద్ నుంచి తీసుకొస్తు్న్న కోడెల పార్థివదేహానికి మార్గంమధ్యలో స్థానిక నేతలు నివాళులర్పిస్తున్నారు. నందిగామ వద్ద తెదేపా నేతలు కోడెలకు అంజలి ఘటించారు. జోరు వర్షంలోనూ తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు ప్రజలు రోడ్లపైకి చేరుకున్నారు. కోడెల పార్థివదేహం తీసుకొస్తున్న వాహనం వెంట తెదేపా అధినేత చంద్రబాబు, ఎంపీ కేశినేని నాని సహా పలువురు తెదేపా నేతలు ఉన్నారు.
మేము ఆవేదనలో ఉన్నాం…తర్వాత అన్నీ మాట్లడతాను
Related tags :