Movies

మాతృభూమి సేవ

Payal Rajput New Movei Titled Alivelu

తాను పుట్టిన ఊరికి ఎదురైన సమస్యను అలివేలు అనే యువతి ఏ విధంగా పరిష్కరించింది? అందం, తెగువ కలగలసిన ఆ అమ్మాయి కథేమిటన్నది తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నది పాయల్ రాజ్‌పుత్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఆర్‌డీఎక్స్ లవ్. శంకర్‌భాను దర్శకుడు. హ్యాపీ మూవీస్ పతాకంపై సి. కల్యాణ్ నిర్మిస్తున్నారు. తేజస్ కంచర్ల కథానాయకుడు. అక్టోబర్ 11న ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ ఆశయసాధన కోసం పోరాడే ఓ యువతి కథ ఇది. ప్రేమ, రొమాన్స్, వినోదం, సందేశం సమపాళ్లలో మేళవించి రూపొందించాం. పాయల్ రాజ్‌పుత్ పాత్ర నవ్యరీతిలో ఉంటుంది. ఆమెపై తెరకెక్కించిన పోరాట ఘట్టాలు అలరిస్తాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి అని తెలిపారు. నరేష్, ఆదిత్యమీనన్, నాగినీడు, తులసి, ఆమని, ముమైత్‌ఖాన్ ప్రధాన పాత్రల్లోనటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రధన్, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్.