ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు
కూన బెయిల్ విచారణ సోమవారానికి వాయిదా ..
చలో ఆత్మకూరు సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారి విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో మాజీ మంత్రి,తెదేపా శాసనసభ పక్ష ఉపనేతకింజరాపు అచ్చెన్నాయుడుకి అరెస్టు వారెంట్ జారీ అయినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది.
దీంతో పాటు ఆయనపై ఇప్పటికే టెక్కలి పోలీస్ స్టేషన్ లో సైతం కేసు నమోదైన నేపధ్యంలో ఏ క్షణమైనా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
ఈ మేరకు ‘నిజం’ టెక్కలి ఎస్.ఐను సంప్రదించగా ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనని కేసు నమోదు సంబందిత పోలీస్ స్టేషన్ పరిధి జరుగుతుందని తెలిపారు.
ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ జిల్లా కీలక వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై రాజధాని ప్రాంతంలో కేసు నమోదైనట్లు ధృవీకరించారు.
ఆ కేసులో ఆయనకు అరెస్ట్ వారెంట్ రెఢి అయినట్లుగా వారు పేర్కోంటున్నారు.
ఈ పరిణామాల నేపధ్యంలో అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా కూడా చర్చించుకుంటున్నారు.
కూన బెయిల్ విచారణ సోమవారానికి వాయిదా …
ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్న ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ తనపై నమోదైన కేసుకు సంబందించి హై కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ వచ్చే సోమవారానికి వాయిదా పడినట్లుగా టిడిపి వర్గాలు పేర్కోంటున్నాయి.
కూన రవికుమార్ వ్యక్తిగత న్యాయవాది అందుబాటులో లేకపోవడం వల్ల హై కోర్టులో విచారణ సోమవారానికి వాయిదాపడినట్లుగా చెబుతున్నాయి.