ScienceAndTech

Qhubతో Whub ఒప్పందం

Hyderabad based Qhub signs Mou with Whub Hong Kond

హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ సంస్థ Qhub సంస్థ హాంగ్‌కాంగ్‌కు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ Whub సంస్థతో తెలంగాణా ప్రభుత్వం ఆధ్వర్యంలో MoU కుదుర్చుకుంది. ఈ MoU ద్వారా ఇండియా, చైనా, హాంగ్‌కాంగ్ దేశాల్లో ఆర్థిక రంగంలో నూతన సాంకేతికతను పరస్పర మార్పిడి చేసుకునేందుకు వీలుపడుతుందని Qhub సీఈఓ ప్రియాంకా వల్లేపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, క్వాలిటీ మ్యాట్రిక్స్ సంస్థ సీఈఓ వల్లేపల్లి శశికాంత్, ఇండియన్ బ్లాక్ చైన్ కమిటీ చైర్మన్ జె.ఎ.చౌదరి, DLF వెంచర్స్ సీఈఓ పొట్లూరి లక్ష్మీ, స్టేట్ స్ట్రీట్ బ్యాంకు CIO కాజా రమేశ్, Whub సీఈఓ కరెన బెలిన్ తదితరులు పాల్గొన్నారు.