Editorials

మద్యం వ్యాపారులు, కేసులున్నవారు, బడా పెట్టుబడిదారులు, అస్మదీయులు…వీళ్ళు టిటిడి బోర్డ్ సభ్యులా!?-TNI ప్రత్యేకం

Criminals Appointed To TTD Board Membership-TNILIVE Specials

తిరుమల కొండపై కొత్త పెత్తందార్లు కొలువుతీరారు. కొందరు ముక్కూమొహం తెలియని వారు కూడా రాజకీయ సిఫారసులతో తిరుమల కొండపై పెత్తనానికి సిద్ధం అవుతున్నారు. చాలా మంది సిఫారసులతో టిటిడి కొలువు దక్కించుకున్నారు. డా.నిశ్చిత ముత్తవరపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సమీప బంధువు, ఆమెకు తమిళనాడు కోటాలో టిటిడి బోర్డులో స్థానం కల్పించారు. తమిళనాడు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ కూడా ఆమె పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ కు సన్నిహితుడైన మద్యం వ్యాపారి నాదెళ్ళ సుబ్బారావుకు బోర్డులో స్థానం ఇవ్వటం పట్ల భక్తులు నిరసన వ్యక్తపరుస్తున్నారు. మద్యం వ్యాపారిని ఎలా పవిత్రమైన స్థానంలో కూర్చోపెడతారని సిఎం జగన్ ను భక్తులు నిలదీస్తున్నారు. తమిళనాడు కోటా నుండి సీటు దక్కించుకున్న ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్, క్రిమినల్ కేసుల్లో జగన్ తో పాటు విచారణ ఎదుర్కొంటున్నారు. తెలంగాణా నుండి టిటిడి బోర్డ్ లో నియమితులైన వారులో బడా వ్యాపారులే ఎక్కువగా ఉన్నారు. పుట్టా ప్రతాప్ రెడ్డీ , హెట్రో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథరెడ్డి, కావేరీ సీడ్స్ అధినేత భాస్కరరావు, మై హోమ్స్ అధినేత రామేశ్వరరావులు జగన్ కు అత్యంత సన్నిహితులు. మురంశెట్టి రాములు కేసిఆర్ ఆంతరంగిక వ్యక్తి అంట.

* వైకాపా పార్టీ వ్యవస్థాపకుడికి టిటిడిలో చోటు
గతంలో వైకాపా పార్టీని స్థాపించి అనంతరం దానిని జగన్ కు అమ్మేసిన శివకుమార్‌ను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. గతంలో శివకుమార్ రాజకీయంగా జగన్ పై రచ్చరచ్చ చేశారు. అనూహ్యంగా ఆయనను టిటిడి బోర్డ్ మెంబర్ గా నియమించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏపీ కోటాలో నియమితులైన ముగ్గురు ఎమెల్యేలు తప్ప మిగినవాళ్ళు ఎవరూ ఎవరికీ తెలియదు. కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్రల నుంచి ఎంపిక చేసిన వాళ్ళు కూడా భక్తులకు కొత్త వారే. వారు తిరుమల వెంకన్నకు ఇప్పటి వరకు ఏమి సేవలందించారో ఎవరికీ తెలియదు. కేవలం చెవిరెడ్డి భాస్కరరెడ్డి కోసమే తుడా చైర్మన్ ను ఎక్స్ అఫీషియో మెంబర్ గా నియమించారు.

స్థానికులకు 75% అంటే ఏపీ నుండి18 మంది ఉండాలి కదా. 25 టిటిడి సభ్యుల్లో అదికూడా చివర్లో మసిపూసి 7 నుండి 8గా ఏపీకి మార్చారు. అయినప్పటికీ..
8 ఏపీ
7 తెలంగాణ
4 తమిళనాడు
3 కర్ణాటక
1 మహారాష్ట్ర
1 ఢిల్లీ
అమెరికా ఒకటి మిస్ అయ్యింది. వీరిలో ఇద్దరు కూడా బలహీన వర్గాలు వారు దొరకలేదా? స్థానికులకు 75% అంటే ఏపీ నుండి18 మంది ఉండాలి కదా? ఆధ్యాత్మితకు నిలయమైన టిటిడి ట్రస్ట్ బోర్డ్ లో మద్యం వ్యాపారులు, బడా కంపెనీల యజమానులు, క్రిమినల్స్ , అనామకులకు, అస్మదీయులకు చోటు కల్పించడం పట్ల భక్తులు తీవ్ర నిరసన వ్యక్తపరుస్తున్నారు. ఇదేనా జగన్ మార్కు పరిపాలన? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.—కిలారు ముద్దు కృష్ణ , సీనియర్ జర్నలిస్ట్