పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు.
అస్సాంలో చేపట్టిన ఎన్ఆర్‌సీ గురించి కేంద్ర మంత్రితో సీఎం బెనర్జీ చర్చించారు.
బెంగాల్‌లో ఎన్ఆర్‌సీ చేపట్టాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. అస్సాంలో 19 లక్షల మందిని పౌరుల జాబితా నుంచి తొలగించిన విషయం తెలిసిందే.
ఎన్ఆర్‌సీ జాబితాలో చోటు దక్కనివారిలో హిందీ, బెంగాలీ, అస్సామీ మాట్లాడే స్థానికులు ఉన్నారన్నారు. నిజమైన ఓటర్లను కూడా కోల్పోయామన్నారు.
దీనికి సంబంధించి షాకు లేఖ అందజేసినట్లు దీదీ తెలిపారు.
మరోవైపు కోల్‌కతా మాజీ పోలీసు కమీషనర్ రాజీవ్ కుమార్‌ను సీబీఐ విచారిస్తున్న కేసు విషయంలోనూ షాతో దీదీ మాట్లాడేందుకు వచ్చినట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి.