దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి మార్కెట్లోకి సరికొత్త కారును తీసుకురానుంది. ఇప్పటి వరకు ఎస్-ప్రెస్సో పేరుతో వ్యవహరిస్తున్న ఈ మినీ ఎస్‌యూవీ ఎంట్రీ లెవల్ విభాగాన్ని పూర్తిగా మార్చేస్తుందని మారుతి పేర్కొంది. పండుగ సీజన్‌లో విడుదలకానున్న ఈ కారుపై మారుతీ భారీగా ఆశలు పెట్టుకొంది. ఈ కారు పూర్తిగా దేశీయ టెక్నాలజీతో భారత అవసరాల కోసం తయారు చేసినట్లు వెల్లడించింది. ‘‘యువత కారు కొనుగోలు చేసే సమయంలో ఖరీదు, నిర్వహణ ఖర్చు చూసేవారు. ఇప్పుడు డిజైనింగ్, లుక్స్‌ను పట్టించుకొంటున్నట్లు మా పరిశోధనలో తేలింది.’’ అని మారుతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.రామన్ మాట్లాడుతూ..‘‘మారుతి సుజుకీ తయారు చేసిన ఎస్-ప్రెస్సో చిన్నకార్ల విభాగంలో భారీ మార్పులు తీసుకొస్తుంది. దీని డిజైన్ లాంగ్వేజ్ మా ఎస్‌యూవీ లైనప్‌ను ప్రతిబింబిస్తుంది. దీంతోపాటు ఆధునిక జీవన శైలిని తలపిస్తుంది.’’ అని తెలిపారు.
మారుతీ మినీ SUV
Related tags :