రక్తం చిందినట్టు ఎరుపు రంగులోకి మారిపోయిన ఆకాశం..
‘ఇది అంగారక గ్రహం కాదు.. మా ఊరే’
ఇండోనేషియా ఆకాశం రక్తవర్ణంలోకి మారింది
ఇండోనేషియాలోని చాలా ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగడంతో దేశంలోని ఒక ప్రావిన్స్ అంతా ఆకాశం రక్తం చిందినట్టు ఎర్రగా మారింది.
జాంబీ ప్రావిన్సులోని ఒక మహిళ ఎర్రగా ఉన్న ఆకాశాన్ని ఫొటోలు తీశారు.
పొగమంచు వల్ల కళ్లు, గొంతు మండుతున్నాయని చెప్పారు.
ఇండోనేసియాలో ప్రతిఏటా కార్చిచ్చు వల్ల పొగమంచు కమ్మేస్తుంటుంది.
అది ఆగ్నేయాసియా అంతా కప్పేస్తుంది.
ఆకాశం ఎర్రగా మారే ఇలాంటి అసాధారణ దృశ్యాన్ని ‘రేలీగ్ విక్షేపం’ అంటారని వాతావరణ నిపుణులు చెప్పారు.
జాంబీ ప్రావిన్సులోని మెకర్ సరి గ్రామంలో ఎకా వులందరి అనే మహిళ శనివారం మధ్యాహ్నం రక్తవర్ణంలో ఉన్న ఆకాశాన్ని చాలా ఫొటోలు తీశారు.
‘అంగారక గ్రహం కాదు’ మా ఊరే అంటున్న ఈ డోనేషియా స్థానికులు.