టీడీపీ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు నోటికి వచ్చినట్లు కనీసం గౌరవం లేకుండా మాట్లాడటం సరికాదని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖలోని ప్రభుత్వ అతిధి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మీ అవినీతిని, దోపిడీని భరించలేక ప్రజలు జగన్ కు పట్టం కట్టారన్నారు. జగన్ రౌడీయిజం చేశారని అన్నారని విశాఖలో జగన్ ఏమి రౌడీయిజం చేశారో చెప్పాలన్నారు. పక్కనే రౌడీలను తిప్పుకుంటూ తమపై నిందలా అని ప్రశ్నించారు. 3 నెలల్లో తాము ల్యాండ్ కబ్జా చేసామా,దోపిడీ చేసామా అని నిలదీశారూ. వాల్తేరు క్లబ్ లో పేకాట ఆడేవాళ్ళా మీకు ఫ్రెండ్స్. వాళ్ళకి నిభందనలు విధిస్తే మీకేం కష్టం అని మండిపడ్డారు. పేదల కోసం మాట్లాడకుండా..పేకాటరాయుళ్ల కోసం మాట్లాడుతారా అని ధ్వజమెత్తారు ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి గూబ గుయ్యమనేలా తీర్పు ఇచ్చినా బుద్ధి రావడం లేదన్నారు. జగన్ గేట్లు తెరిస్తే 10 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడి వస్తామంటున్నారని తెలిపారు. అయ్యన్నపాత్రుడు ఇప్పటికైనా సరే ప్రవర్తన మార్చుకుని గౌరవంగా మెలగాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి ని కించపరిస్తే తగిన విధంగా సమాధానం చెప్తామని హెచ్చరించారు. విశాఖలో ఒక గజం స్థలం కబ్జా అయిన సహించేది లేదన్నారు.
అయ్యన్న ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు
Related tags :