DailyDose

సోనాక్షి….డబ్బు ఆశ ఉన్న ఒక పశువు-తాజావార్తలు-09/25

BJP MLA Calls Sonakshi A Greedy Cow - Telugu Fresh News Of The Day - 09/25

* మాయావతి మాజీ కార్యాదర్శి సెత్ రాంకు చెందిన రూ.230 కోట్ల ఆస్తులను ఆదాయపు పన్ను శాఖా జప్తు చేసింది
* ప్రధాని మోడీ ,హోం మంత్రి అమిత్ షా బతికి ఉండడం సోనియా గాంధీకి , రాహుల్ గాంధీకి ఇష్టం లేదని వారికి వ్యతిరేకంగా వారు కుట్రలు చేస్తున్నారని బాబా రాందేవ్ సంచలన ఆరోపణలు చేశారు
* ఆర్టీసీ ఎండీ సురెందర్ బాబును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో రవాణా శాఖా కార్యాదర్శిగా ఉంటున్న కే టీ కృష్ణబాబుకు ఆర్టీసీ ఎండీగా అదనపు భాద్యతలు అప్పగించారు
* కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 12 ఏళ్ల బాలుడు తనను తల్లిదండ్రులు వేధిస్తున్నారు అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది
* హాస్యనటుడు వేణుమాధవ్ మృతికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటూ పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు
* తనను జైలుకు పంపడానికి భాజాపా నేతలు కుట్ర పన్నుతున్నారని అవసరమైతే తానూ జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని మరాఠా నేత శరద్ పవార్ ప్రకటించారు
* కృష్ణా కరకట్టపై తాను నిర్మించిన అతిధి గృహం అక్రమమైనది కాదని తనకు అన్ని అనుమతులు ఉన్నాయని దానిని పడగొట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని భవనం యజమాని లింగమనేని రమేష్ నేడు హై కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణను హై కోర్టు సోమవారం నాటికి వాయిదా వేసింది
* సోనాక్షి సిన్హా డబ్బు ఆశ ఉన్న ఒక పశువుతో సమానం అని ఉత్తర ప్రదేశ్ కి చెందన మంత్రి సునీల్ బరాలా సంచలన వ్యాఖ్యలు చేశారు
* సైరా సినిమా విడుదల నేపధ్యంలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డీ వంశస్థులు నటుడు చిరంజీవిని కలుసుకున్నారు. చిరంజీవికి అభినందనలు అందచేశారు
* బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను చంపివేస్తాం అంటూ బెదిరింపులు రావడంతో ఆయనకు భద్రతను పెంచారు
* వైసీపీ కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమిస్తారని వార్తలు వెలువడ్డాయి
* ఏపీ తహసిల్దారుల సంఘం గౌరవ అధ్యక్షురాలిగా విజయవాడా తహసిల్దార్ వనజాక్షి ఎన్నికయ్యారు
* నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసాయి బ్యాంకింగ్, ఆటో షేర్లు పడిపోయాయి
* విశాఖలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న నేపధ్యంలో కోస్తా తీరం వెంబట గస్తీని ముమ్మరం చేశారు
* అక్టోబర్ 1 నుంచి కేంద్రం వాహనాల రిజిస్ట్రేషన్ , డ్రైవింగ్ లైసెన్స్ ల విధానంలో నూతన మార్పులను చేపట్టనుంది
* కర్ణాటకలో ముక్కుసూటిగా వ్యవహరించే ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిని మళ్ళీ బదిలీ చేశారు. గత సంవత్సర కాలంలో ఆమెకిది ఐదవ బదిలీ
* విద్యుత్ ఒప్పందాలను పునఃసమీక్షా చేయాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ కేంద్ర ఇంధన శాఖా సహాయ మంత్రి ఆర్కే సింగ్ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు.