* వాము వేయించి పొడి చేసుకోవాలి. కొద్దిగా వేడి అన్నంలో చెంచా వాముపొడి, అరచెంచా కరిగించిన నెయ్యి వేసుకుని తినాలి.
* జీలకర్ర వేయించి పొడి చేసుకొని భద్రపరుచుకోవాలి. కప్పు నీటిలో చెంచా పొడి వేసి మరిగించాలి. నీరు సగం అయ్యాక ఈ కషాయాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్దిగా బెల్లం కలిపి తాగాలి.
* పుదీనా పచ్చడిని తరచూ ఆహారంలో తింటూంటే తేన్పులు తగ్గుతాయి.
* భోజనం చేసిన వెంటనే అరచెంచా సోంపు నోట్లో వేసుకుని నెమ్మదిగా నమిలినా ఉపశమనం ఉంటుంది.
* రెండు లేదా మూడు లేత తమలపాకుల్లో కొద్దిగా వక్క, సున్నం, ఒక లవంగం వేసుకోవాలి. అన్నం తిన్న తరువాత ఈ తాంబూలం నోట్లో పెట్టుకుని నెమ్మదిగా నములుతూంటే సమస్య చాలామటుకు తగ్గుతుంది.
తేన్పులకు వాముపొడి ఉపశమనం
Related tags :