జిడ్డుచర్మం… కాలం ఏదైనా మనలో చాలామందిని ఇబ్బంది పెడుతుంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే… మొటిమలు మొదలు మరెన్నో సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఈ చిట్కాలు పాటించి చూడండి.
* ఈ సమస్య ఉన్నవారు సబ్బు వాడకపోవడమే మంచిది. అది చర్మంలోని సహజ నూనెలను తొలగిస్తుంది. పీహెచ్ స్థాయులను ప్రభావితం చేస్తుంది. బదులుగా ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ (ఏహెచ్‌ఏ) ఉండే ఫేస్ వాష్‌లను వాడాలి. ముఖాన్ని గోరువెచ్చటి నీటితోనే కడగాలి. ఆ తరువాత పొడి తువాలుతో తడిపోయేలా అద్దుకోవాలి తప్ప గట్టిగా తుడవకూడదు.
* జిడ్డు చర్మం ఉన్నవారు గ్లిజరిన్ ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించాలి. ఇది చర్మాన్ని తేమగా ఉంచి, జిడ్డు సమస్యను తగ్గిస్తుంది.
* ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత టోనర్ వాడాలి. ఆ తరువాత నీటి ఆధారిత మాయిశ్చరైజర్‌ను రాసుకుంటే సమస్య అదుపులోకి వస్తుంది.
* వారానికోసారి ఏదైనా పూతను వేసుకోవాలి. అదీ ఇంట్లో ఉండే పదార్థాలతో చేసినదైతే మంచిది. ఎలాగంటే… టొమాటో రసాన్ని వడబోసి గింజల తీసేయాలి. ఇందులో కొన్ని చుక్కల తేనె కలపాలి. దీన్ని ముఖానికి పూతలా వేసుకోవాలి. పావుగంట తరువాత కడిగేస్తే చాలు.
* అరటిపండు గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటిలో వస్త్రాన్ని ముంచి ముఖం తుడుచుకోవాలి. చర్మం తాజాగా మారుతుంది. మృదువుగానూ ఉంటుంది.
ఆ జిడ్డుమొహాన్ని టొమాటోతో రుద్దితే…
Related tags :