ScienceAndTech

ఇస్రో నూతన ఉపగ్రహం పేరు వామన

ISRO Names Its New Satellite Vamana

ఇస్రో తయారు చేస్తున్న పొట్టి రాకెట్ ‘స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్ఎస్ఎల్వీ)’కి విష్ణుమూర్తి ఐదో అవతారమైన ‘వామన’ పేరును పెట్టాలని అంతరిక్ష నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలే తీర రక్షణ నౌకకు ఐఎఎన్ఎస్ వరాహ అని విష్ణుమూర్తి మూడో అవతారం పేరు పెట్టారని, పొడవాటి పేర్ల కన్నా ఇలా మన సంస్కృతిని చాటే చిన్న పేర్లను పెట్టాలని ఇస్రో సీనియర్ అడ్వైజర్ తపన్ మిశ్రా సూచించారు. ‘‘ఎస్ఎస్ఎల్వీని 500 కిలోల పేలోడ్లను అంతరిక్షానికి పంపేందుకు తయారు చేస్తున్నారు. వామనావతారంలో వామన రూపం పొట్టిది. ముల్లోకాలను ఆక్రమించేది త్రివిక్రమ రూపం. అందుకే ఈ రాకెట్‌‌కు వామన అని పేరు పెడితే బాగుంటుంది’’ అని తపన్ మిశ్రా చెప్పారు. ‘మన కొత్త రాకెట్ పవర్, ప్రత్యేకతలను చాటేలా మన కల్చర్ కు సంబంధించిన పేర్లనే పెట్టుకుంటే బాగుంటుంది’ అని ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ కూడా అభిప్రాయపడ్డారు. జీఎస్ఎల్వీ మార్క్ 3ని సైంటిస్టులు ఫ్యాట్ బోయ్ అని పిలుచుకుంటే.. మీడియా, జనం బాహుబలి అని పిలుచుకున్నారంటూ గుర్తు చేశారు.