*గుంటూరు జిల్లాతాడేపల్లి మండలం పెనుమాక గ్రామం లో భర్తని చంపిన భార్యమరదలి జోతి సహజీవనం చేస్తున్నాడని అక్కసుతో ఘటనకు పాల్పడిన భార్య సునీతపరారీ లో భార్య సునీతఅక్కడి అక్కడే మృతి చెందిన కుంచె రత్న కుమార్ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన తాడేపల్లి పోలీసులు
*తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం పెరుమల్లాపురం సమీపంలో గల అవలదారుపాడు గ్రామంలో కోడిపందాలు ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేయగా పందెం రాయుళ్లు ఒక్క సారిగా పోలీసులపై కర్రలు, రాళ్లు, మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచారు. మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం మనిమల్ల దొంగబ్బాయి, గంపల సత్తిబాబు అనేవారికి చెందిన సారా బట్టిని పోలీసులు పట్టుకున్నారు అనే కోపంతో మిగిలిన జనాన్ని రెచ్చగొట్టి పోలీస్ వారిపైకి దాడి చేయడానికి ప్రేరేపించినట్లు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం తెలియడంతో ఎస్. పి. ఈ దాడిని సీరియస్ గా తీసుకున్నారు. గాయపడిన ఎ. ఎస్. ఐ. ఆంజనేయులు, హోమ్ గార్డ్ సతీష్ లకు గాయములు కాగా వారిని తొండంగి ఎస్. ఐ. కృష్ణాచారి చికిత్స నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరిలి0చినట్లు తెలిపారు.
* గోడౌన్ లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణ సంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన సోమవారం లకవరంలో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం లోని వందనపు గిరి కిరాణా దుకాణం లో పోలీసులు గుట్కా తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఒక గోడౌన్‌లో దాచిన 47000 రూపాయల ఖరీదు చేసే బాణసంచాను పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. లక్కవరం ఎస్‌ఐ పరిమి రమేష్ కేసు నమోదు చేశారు.
* బెంజ్ సర్కిల్ జ్యోతి మహాల్ వద్ద రోడ్డు ప్రమాదంబైక్ ను వేగంగ ఢీకొన్న లారీ ..టీవీ9 స్టూడియో కెమెరామెన్ మురళి మృతిరోడ్డు క్రాస్ చేస్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీ కొనడంతో స్పాట్ లో చనిపోయిన టీవీ9 కెమెరామెన్ మురళి..
*అధికార పార్టీ నేతల వేధింపులతో ఓ వెలుగు ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది. కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది.
* తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లాలో బాణాసంచా వ్యాన్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పేలుడు సంభవించడంతో స్థానికులు భయంతో పరుగులుతీశారు.
* గోడౌన్ లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణ సంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన సోమవారం లకవరంలో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం లోని వందనపు గిరి కిరాణా దుకాణం లో పోలీసులు గుట్కా తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఒక గోడౌన్‌లో దాచిన 47000 రూపాయల ఖరీదు చేసే బాణసంచాను పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. లక్కవరం ఎస్‌ఐ పరిమి రమేష్ కేసు నమోదు చేశారు.
* ఇండిగో విమానానికి మరోసారి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. 180మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానంలో అకస్మాత్తుగా మంటలు వ్యాంపించాయి. దీంతో ప్రయాణీకుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే వెంటనే అప్రమత్తమైన పైలట్, విమానాన్ని తిరిగి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో గోవా పర్యావరణ మంత్రి నీలేశ్ కాబ్రాల్ కూడా ఉన్నారు. గోవా దబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
*తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం హవాల్దార్పాడు గ్రామంలో పోలీసులపై కోడిపందేలరాయుళ్లు దాడికి దిగారు. ఆదివారం గ్రామంలో టెంట్ వేసి కోడి పందేలు, గుండాట నిర్వహిస్తుండగా ఎస్ఐ గోపాలకృష్ణ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు.
*, శని, ఆదివారాల్లో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకన్డ్రైవ్ స్పెషల్ డ్రైవ్లో మొత్తం 236మంది పట్టుబడ్డారు. 30మంది ఐటీ ఉద్యోగులు పట్టుబడ్డగా, 8 మంది విద్యార్థులు, ముగ్గురు యోగా శిక్షకులు కూడా మద్యం సేవించి వాహనాలు నడిపి దొరికిపోయారు.
* రైల్వేస్టేషన్ వద్ద రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్స్టేష న్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
*తాటిచెట్టు ఎక్కుతుండగా మోకు తెగి గీత కార్మికుడు కిందపడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని పోల్కంపల్లిలో ఆదివారం జరిగింది.
*దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. బంధుత్వాన్ని మరిచిన ఓ ప్రబుద్ధుడు తమ్ముడి భార్యపై నాలుగేళ్లుగా హత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ ఘోర ఘటన గురుగ్రామ్లోని బజ్గేరా గ్రామంలో జరిగింది.
*పశ్చిమబెంగాల్ క్యాడర్‌కు చెందిన ఓ ఐపీఎస్ అధికారిపై అత్యాచార ఆరోపణలతో దిల్లీ పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీకి చెందిన ఓ మహిళకు 2018లో ఐపీఎస్ అధికారితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అతడు ఈ ఏడాది జనవరి 27న దిల్లీకి తనను కలవడానికి వచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ బారాఖంబ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.
*విశాఖ మన్యం జి.మాడుగుల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్‌లో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు గ్యాస్ కట్టర్ల సాయంతో షట్టర్లు కోసి లోనికి ప్రవేశించి చోరీ చేశారు.
*మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఓ నిందితుడిని మహారాష్ట్ర థానే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అతడి ఛాతిపై ఉన్న పంటిగాట్ల ఆధారంగా నిందితుడిని కారాగారానికి పంపించారు.
*బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో రోడ్డుపై పడేసిన నెలలు నిండని ఓ పసికందును కుక్కలు పీక్కుతిన్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.
* ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ మాచవరం స్టేషన్ పోలీసుల కథనం ప్రకారం.. మొవ్వకు చెందిన ఓ యువతి నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తోంది.
*అమెరికా అధ్యక్షుడి హోదాలో బరాక్ ఒబామా 2015 జనవరి 26న భారత్‌లో పర్యటించినప్పుడు పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నారు.
*ప్రస్తుత సమాజంలో ఆప్యాయతలు కనుమరుగవుతున్నాయి. రక్త సంబంధాలు మాయమవుతున్నాయి. దాడులు, ప్రతి దాడులు నిత్యం జరుగుతున్నాయి. చివరికి అయినవారే ఘాతుకాలకు పాల్పడుతున్నారు. మండలంలోని మంచాలకట్ట గ్రామంలో ఆదివారం సొంత అన్న చెంచు జయంపు వీరన్నను అతని తమ్ముడు మద్దిలేటి దారుణంగా హత్య చేశాడు.
*తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం జి.మేడపాడులో ప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
*సచివాలయంలో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన భూమన్న యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. భూమన్న యాదవ్ స్వస్థలం నిర్మల్‌లో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి భూమన్నకు 14 రోజుల రిమాండ్ విధించారు. పలువురి వద్ద డబ్బులు వసూలు చేశారని భూమన్నయాదవ్‌పై ఆరోపణలు ఉన్నాయి. సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా భూమన్న యాదవ్ ఉన్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు.
*ప్రముఖ బాలీవుడ్ నటుడు వీజూ కోఠె కన్నుమూశారు. 77 సంవత్సరాల వయసున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హిందీ, మరాఠీ భాషల్లో 300కు పైగా సినిమాల్లో నటించారు. కాళీ, సోలీ పేర్లతో ఆయన పాపులర్‌గా నిలిచారు. 1964 సంవత్సరంలో యా మలక్ చిత్రంలో చేసిన పాత్ర తన సినీ జివితాన్ని మలుపు తిప్పింది.
* ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో బిహార్ తడిసిముద్దయింది. వరద తాకిడితో సోమవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 29 మంది మరణించారు. పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం కాగా, 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. సహాయ పునరావాస చర్యలు చేపట్టేందుకు 32 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న రాజధాని పట్నా నగరంలో వరద నీటిలో చిక్కుకున్న దాదాపు 235 మందిని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కాపాడాయి. భారీ వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునగడంతో పట్నాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలను అక్టోబర్ 1 వరకూ మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. రైల్వే ట్రాక్‌లపైకి నీరు చేరడంతో పలు రైళ్లను రద్దు చేశారు. మరోవైపు భారీ వర్షవపాతంపై తాము రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశామని వాతావరణ శాఖ చెబుతుండగా, బిహార్ సీఎం నితీష్ కుమార్ మాత్రం తమ ప్రభుత్వానికి వాతావరణ విభాగం నుంచి భారీ వర్షాలపై ఎలాంటి నిర్ధిష్ట సమాచారం లేదని పేర్కొనడం గమనార్హం.
* గుంటూరు జిల్లాదాచేపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ముస్యం శ్రీనివాసరావు అనే వ్యక్తి తన తో పాటు భార్య ,కూతురు పై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం.
* తూ.గో.జిల్లా సామర్లకోట మండలం మేడపాడు గ్రామంలో ఇందిరా ఫైర్ వర్క్స్ మందుగుండు సామానం తయారు చేస్తుండగా అగ్ని ప్రమాదం..
ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలు వారిలో ఏడుగురి పరిస్థితి విషయం..కాకినాడ జిజిహెచ్ క్షతగాత్రులను తరలింపు.
అమరావతిలో భర్తను చంపిన భార్య–నేరవార్తలు-09/30
Related tags :