NRI-NRT

లండన్‌లో TDF దసరా

TNILIVE London Telugu News - TDF Celebrates Dasara Batukamma 2019 In London

తెలంగాణ డెవలెప్మెంట్ ఫోరం యుకె, యూరప్, లండన్లో నిర్వహిస్తున్న బతుకమ్మ మరియు దసరా సంబరాలు లండన్ లోని బార్కింగ్ లోని బార్కింగ్ అబ్బె స్కూల్ లోని హాలు లో జరిగినది. ఈ ఉత్సవానికి సుమారు ఐదు వందల మంది తెలంగాణ మరియు ఆంధ్ర సోదర సోదరిమణులు హాజరైనారు. ఎంతో మంది తెలంగాణ మహిళలు బతుకమ్మలను చేసి తీసుకొని వచ్చి ఆట పాటలతో హోరిత్తించారు. సంస్థ నిర్విహించిన చిన్న పిల్లలు చేసిన నృత్య గీతాలు సభికులని అలరించాయి. ఈ బతుకమ్మ , దసరా సంబరాలలో తెలంగాణ మహిళలు ఆట పాటలతో సభాప్రాంగణం నందుకనుల పండుగ వాతావరణం కల్పించారు. తెలంగాణ డెవలెప్మెంట్ ఫోరం యుకె, యూరప్,సభ్యులు అక్కడికి విచ్హేసిన పిల్లలతో తెలంగాణ వేష ధారణతో ఫ్యాషన్ షో నిర్వహించారు. తెలంగాణ ఆడ పడచులు చేసిన వివిధ నృత్యాలు సభికులని ఆకర్షించాయి.

ఈ బతుకమ్మ, దసరా కి విచ్హేసిన ప్రవాస తెలంగాణ ప్రజలకి తెలంగాణ వంటకాలు చికెన్ బిర్యాని, మటన్ కర్రి , వెజ్ ఫ్రైడ్ రైస్, భగారా భైంగన్, వడ , జిలేబిలతో ఈ సంస్థ సభ్యులు కూర్చో పెట్టి వడ్డించడం విశేషం. వచ్చిన ఆహ్వానితులందరికి అయ్యగారు పూజ చేసి జమ్మిని అందరికి పంచడం, అదే విధముగా వచ్హిన వారందరూ జమ్మి ని ఇచ్చి పుచ్చు కొని ఆలింగనం చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచినది. ఈ పండుగ ను ఇంత బ్రహ్మండము గా నిర్వహించినందుకు ఈ సంస్థ సభ్యులందరిని వచ్చిన తెలంగాణ ప్రజలు మెచ్చుకోవడం విశేషం.

దీనిపై వచ్చిన డబ్బులతో అక్షరజ్యోతి అనే బానర్ క్రింద తెలాంగణ ప్రాంత పాఠశాలలకు వస్తు రూపమున విరాళముగా అందచేయడం విశేషం.

ఈ కార్యక్రమానికి కి వచ్చి ఆట పాటల్తో మెప్పించిన చిన్నారులకు తెలంగాణ డెవలెప్మెంట్ ఫోరం యుకె, యూరప్, లండన్ సంస్థ అధ్యక్షులు శ్రీ బైరు శ్రవణ్ కుమార్ గౌడ్ గారు అక్కడికి వచ్చిన ఆహ్వానితుల తల్లిదండ్రులతో చిన్నారులకు మెమెంటోలు బహుకరించడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.

ఈ కార్యక్రమము విజయవంతము కొసం కృషి చేసిన తెలంగాణ డెవలెప్మెంట్ ఫోరం యుకె, యూరప్ సభ్యులు శ్రీ కమల్ ఓరుగంటి, శ్రీ శ్రీనివాస్ రెడ్డి పింగళి, , శ్రీ రాజు చక్రి, శ్రీ శశి కృష్ణ గోవింద్, శ్రీ శ్రవణ్ ఉప్పల, శ్రీ జూపల్లి ప్రవీణ్, శ్రీ నాగ రాజు అడ్డగల్ల, శ్రీ రాజేంద్ర పూజారి, శ్రీ శ్రీకాంత్ కాంచనపల్లి, శ్రీ మాదాల శ్రీనివాస్, శ్రీ శ్రీకాంత్ బెల్డె, శ్రీ నగేష బత్తుల, డాక్టర్ మోహన్, డాక్టర్ కమల్ లకు చివరన ధన్యవాదాలు తెలిపారు .