‘‘పక్కింటి అమ్మాయి, కాలేజీ స్టూడెంట్, మరదలు పిల్ల.. ఇలాంటి పాత్రలు ఇంకెంత కాలం చేస్తాను? ప్రయోగాత్మకమైన పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కథానాయిక పాత్రలే కాదు.. ప్రతినాయిక ఛాయలు ఉన్న పాత్రలతో కూడా ప్రేక్షకులకు దగ్గర కావొచ్చు’’ అని అంటున్నారు రాయ్‌లక్ష్మీ. చెప్పినట్లుగానే ఓ నెగటివ్ క్యారెక్టర్ చేయడానికి సిద్ధమవుతున్నారు. 2015లో ముంబైలో వెలుగులోకి వచ్చిన షీనా బోరా హత్య కేసు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. కూతురు షీనా బోరాను ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జియా 2012లో హత్య చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంచలన సంఘటన ఆధారంగా దర్శకుడు స్వరాజ్ ఓ సినిమా చేయాలని కథ రెడీ చేస్తున్నారు. ఇందులో ఇంద్రాణీ పాత్ర చేయమని రాయ్‌లక్ష్మీని అడిగితే ఓకే అన్నారట.
ప్రయోగాలకు సిద్ధం
Related tags :