Sports

కపిల్ చేతుల మీదుగ రామినేని పురస్కారాల ప్రదానోత్సవం

Kapil Dev To Award Ramineni Puraskaram 2019 In Guntur

అమెరికాలోని ప్రవాస భారతీయ రామినేని ఫౌండేషన్ విద్యా పురస్కారాలను ప్రకటించింది. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా గురు పురస్కారాలు, గురు సన్మానాలు, ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేస్తోంది. ఈ నెల 9న గుంటూరులోని సిద్ధార్ధ గార్డెన్స్ లో 106 మందికి గురు పురస్కారాలు, 84 మందికి గురు సన్మానాలు నిర్వహించనుంది. అలాగే జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న 261 విద్యార్ధులకు ప్రతిభా పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు రామినేని ఫౌండేషన్ ఛైర్మన్ ధర్మ ప్రచారక్, కన్వీనర్ పాతూరి నాగభూషణం చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదువుకొని ఎందరో ప్రముఖులు ఉన్నత స్థానాలను అధిరోహించారని ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో తమ ఫౌండేషన్ పనిచేస్తుందని వారు చెప్పారు.