ఒత్తిడిని జయించాలనే ఆలోచన.. కాలుష్యానికి దూరంగా సేదతీరాలనే తపన.. పిల్లలకు పల్లె వాతావరణం పరిచయం చేయాలనే భావనతో నగరవాసులు చాలామంది సెలవురోజుల్లో ప్రకృతి మధ్య గడిపేందుకు మొగ్గుచూపుతున్నారు. వారిని ఆకట్టుకోడానికి హైదరాబాద్ శివార్లలోని కొన్ని రిసార్ట్లు, ఫామ్‌హౌస్‌లు విడిది ప్రాంతాల్లా రూపుమార్చుకుంటున్నాయి. వాటిలో ఎడ్ల బండ్లు, పల్లెల్లోని సంత, గ్రామీణ భోజన పదార్థాల రుచులు ఏర్పాటు చేస్తున్నారు. మట్టికుండలు తయారుచేయటం, గోళీలాటలు, గుజ్జనగూళ్లు, కోతికొమ్మచ్చి.. ఇలా ఇప్పటి చిన్నారులకు పాతతరం ఆటలను పరిచయం చేస్తున్నారు. ఆవులు, మేకల వంటి పెంపుడు జంతువులు ఉంటాయక్కడ. వాటి ఆహారపు అలవాట్లను తెలుసుకోవచ్చు. కార్పొరేట్ ఉద్యోగుల్లో చాలామందికి మంచి సంపాదన.. ఉండడానికి మంచి ఇల్లూ ఉన్నా ఏదో తెలియని అసంతృప్తి. దానిని పోగొట్టుకోవడానికి వారాంతాల్లో నగరానికి దూరంగా గోశాలల వద్దకు చేరుతున్నారు. హోదా, స్థాయి పక్కనపెట్టి అక్కడి విసర్జితాలను చేతులతో తొలగిస్తుంటారు. చెట్లనీడలో కబుర్లు చెప్పుకుంటూ మనసు తేలిక పరచుకుంటున్నారు. సహజసిద్ధమైన వాతావరణంలో గడపడం కొత్త అనుభూతులను మాత్రమే కాదు.. సరికొత్త ఉత్తేజాన్ని పంచుతుందంటారు సేంద్రీయ వ్యవసాయదారు పైడిపర్రి చంద్రశేఖర్.
పిల్లలూ…దసరా సెలవుల్లో కోతి కొమ్మొచ్చి ఆడుదామా?
Related tags :