Business

విశాఖ-వారణాసి ప్రత్యేక రైలు

Visakhapatnam - Varanasi Special Train For Holidays

పూజ స్పెషల్, శీతకాలం ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి నేరుగా వారణాసికి రైలు సదుపాయం ఆరంభం కానుంది. విజయదశమి రోజున సువిధ స్పెషల్ ఎక్స్​ప్రెస్​గా ఈ రైలు విశాఖ-అలహాబాద్- సుబేదార్ గంజ్​లకు నడుపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈనెల 8 నుంచి నవంబర్ 21 వరకు షెడ్యూల్​ను ఖరారు చేశారు. విశాఖలో ప్రతి మంగళవారం రాత్రి 11 గంటల 50 నిమిషాలకు బయలుదేరి గురువారం ఉదయం 8గంటల 10 నిమిషాలు అలహాబాద్ చేరుకుంటుంది. మళ్లీ అక్కడి నుంచి బయలుదేరి 8.30 గంటలకు సుబేదార్ గంజ్ కి చేరుకుంటుంది. విశాఖ… విజయనగరం.. భువనేశ్వర్.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జంక్షన్… అలహాబాద్ ల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది