DailyDose

గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత-నేరవార్తలు-10/07

448 Cases Against YS Jagans Govt In Lokayukta-Telugu Crime News Today-10/07

* అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌ పార్క్‌ వద్ద నివాళులర్పించేందుకు ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గన్ పార్క్ వద్దకు తరలివస్తున్నఆర్టీసీ కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. గన్‌ పార్క్‌ వద్ద ధర్నా, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఆర్టీసీ కార్మికులు మాత్రం తాము గన్‌ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివారులర్పించడానికి వచ్చామని, దీనికి అరెస్టు చేయడమేమిటని మండిపడుతున్నారు. మరికాసేపట్లో గన్‌ పార్క్ వద్దకు ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మిక సంఘాల నేతలు వచ్చే అవకాశముండటంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది.

* నగరంలోని ఓ ప్రముఖుడికి ‘ప్లీజ్‌ హెల్ప్‌ మీ’ అంటూ మిత్రుడి నుంచి మెయిల్‌ వచ్చింది. పూర్తిగా చదివిన తర్వాత రూ.50వేలు ఆన్‌లైన్‌లో పంపించేందుకు ఆయన సిద్ధమయ్యారు. చివరి క్షణంలో ఏదో అనుమానం రావడంతో మిత్రుడి ఇంటికి ఫోన్‌ చేశారు. తాము ఎటువంటి మెయిల్‌ పంపించలేదని వారు చెప్పారు. ఓ మహిళ సైతం తనకు ఇదే తరహా మెయిల్‌ వచ్చిందంటూ రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. వీరిద్దరికే కాదు.. ఎందరికో ఈ రకమైనవి వస్తున్నాయి. డబ్బు కాజేసేందుకు సైబర్‌ కేటుగాళ్లు ఇలాంటి కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు.

* ఏపీ సీఎం పై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల పై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ కి వైసీపీ నేతలు పిర్యాదు

* ముంబయిలోని ఆరె కాలనీలో మెట్రో కారు షెడ్ కోసం చెట్లను నరికివేయడాన్ని తక్షణమే ఆపాలని సుప్రీంకోర్టు అదేశించింది. వృక్షాలను తొలగించొద్దని, అరెస్ట్​ చేసిన ఆందోళనకారులను విడుదల చేయాలని సూచించింది.

* సెల్ఫీ మోజు నలుగురు ప్రాణాలను బలి తీసుకుంది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై సమీపంలో పాంబార్ జలాశయం వద్ద స్వీయచిత్రం తీసుకునే క్రమంలో నలుగురు నీటిలో పడి మృతి చెందారు.

* జూనాగఢ్​లోని మలంకా గ్రామంలో నదిపై వంతెన పేక మేడలా కుప్పకూలింది. వంతెనపై ఉన్న కార్లన్నీ ధ్వంసమయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు స్థానికులు సాయం చేశారు. నిన్న జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

* దేశం మొత్తం దసరా పండుగ వేడుకల్లో మునిగి ఉన్న ప్రస్తుత తరుణంలో ఉగ్రవాదులు భారీగా పేలుళ్లను సృష్టించడానికి కుట్ర పన్నారు. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ ఏడాది ఫిబ్రవరిలో చోటు చేసుకున్న ఆత్మాహూతి దాడి తరహాలోనే మరిన్ని దాడులు చేయడానికి ఉగ్రవాదులు వేసుకున్న ప్లాన్ ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. మొహసిన్ మన్సూర్ సల్హియా అనే ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు.

* 15 రోజుల్లో లోకాయుక్తకు 448 ఫిర్యాదులు. ప్రభుత్వం విస్మయం! ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ భాధ్యతలు చేపట్టిన తరువాత అవినీతి రహిత పాలన అందిస్తామని ప్రకటించారు. పాలనా పరంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అదే సమయంలో కొన్ని వివాదాస్పదంగానూ మారాయి. అయితే…ప్రభుత్వం ఏర్పాటు చేసిన లోకాయుక్తకు వరదలా వస్తున్న ఫిర్యాదులతో అసలు ఏం జరుగుతుందనే ప్రశ్న మొదలైంది. అధికారుల వైఫల్యం, నిర్లక్ష్యం, అసమర్థత వలన కలుగు సమస్యలపై పౌరులు ఫిర్యాదు చేయవచ్చును.