టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను ఎంపీ రేవంత్‌రెడ్డి కలిశారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న ఆయనతో రేవంత్ భేటీ అయ్యారు. అరెస్ట్‌కు దారితీసిన పరిస్థితులపై రవిప్రకాశ్‌ను రేవంత్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. స్వప్రయోజనాల కోసం నిధులు మళ్లించుకున్నారంటూ రవిప్రకాశ్‌పై అసోసియేట్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జి.సింగారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రవిప్రకాశ్‌ను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
రవిప్రకాశ్‌తో రేవంత్ ములాఖాత్
Related tags :