Food

ఇడ్లీ అరబ్బీయులదా?

origin of idli

????????????☘?????????☘???????????????☘????????????
బ్రేక్ ఫాస్ట్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఇడ్లీ. అయితే దోశే, ఉప్మా, పూరి ఇలా ఎలా ఉన్నా .. ఇడ్లీ వేరి వేరి స్పెషల్. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే దీన్ని కడుపు నిండా లాగించేస్తారు. అంతేకాదు ఇడ్లీ సులభంగా జీర్ణం అవుతుంది కూడా. మనదేశంలో ఎ రాష్ట్రంలో అయినా ఈజీగా దొరికే ఇడ్లీ.. ఇక్కడ పుట్టలేదని చరిత్రకారులు చెబుతున్న మాట. ఇడ్లీ అంటే సాధారణంగా దక్షినాది వంటకమని అంతా భావిస్తారు. కానీ ఫుడ్ హిస్తరీయాన్ కేటీ ఆచార్య మాత్రం ఇడ్లీ ఇండోనేషియాలో పుట్టిందని అంటున్నాడు. ఒకప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించిన హిందూ రాజుల దగ్గర పని చేసే వంట మనుషులు ఉడికించే వంటకాలు కనుగోన్నారట. ఇందులో భాగంగానే ఇడ్లీలు తయారు చేయడం మొదలు పెట్టారంట. ఆ తరువాత అంటే 800-1200 సంవత్సరంలో ఇడ్లీ ఇండియాలో అడుగుపెట్టింది. మన దేశంలో తొలిసారిగా కర్ణాటకలో ఇడ్లీలు తాయారు చేశారట. వాటిని అక్కడ ఇడ్డలి గా అని పిలిచేవాళ్ళట. వీటినే సంస్కృతంలో ఇడ్డరికా అనేవాళ్ళట. అరబ్బుల రైస్ బాల్స్ అయితే కైరోలోని అల్- అజహర్ యునివర్సిటి లైబ్రరీలో ఉన్న ఆధారాల ప్రకరం దక్షిణ భూభాగంలో నివసించిన అరబ్ వ్యాపారాలు ఇడ్లీని ఇండియాకు పరిచయం చేశారు.దక్షిణ భారత దేశ ప్రజలను అరబ్బులు పెళ్లి చేసుకోవడంతో పాటు ఈ ప్రాంతాల్లో స్థిరపడటం వాళ్ళ ఇడ్లీ దక్షిణ వంటకంగా పేరొందింది. అంతేకాదు ముస్లీంలు చేసుకునే హలీం కొంచెం స్పెషల్ గా కనిపించేందుకు రైస్ బాల్స్ తయారు చేసేవారు. ఆ తరువాత వాటిని గుండ్రంగా, సన్నగా ఇడ్లీలా చేశారు. దీంతో పాటు ఇడ్లీలను కొబ్బరి చెట్నీతో తినటం అలవాటు చేసుకున్నారు. ఇలా ఇడ్లీలు దేశమంతా వ్యాపించాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఏదెలా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇడ్లీకి మాత్రం ఇండియన్ ఫుడ్ గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేసింది.