ఎనిమిది మంది సంతానం, ఏడుగురు అమ్మాయిల మధ్య ఒక అబ్బాయి. పెద్దమ్మాయి జ్యోతిలక్ష్మి సినిమాలలో డాన్స్ లు చేస్తుంది. ఆమె తో పాటు ఆమె అమ్మ, చిన్న చెల్లెలు అలమేలుమంగ షూటింగ్స్ వస్తుండేవారు. అలమేలుమంగా కు 13 ఏళ్ళు ఉంటాయి అప్పుడు, దర్శకుడు విట్టలాచార్య ఆ అమ్మాయిని చూసి, వీరి అమ్మ ను అడిగారు ‘ మీరు వప్పుకుంటే మీ అమ్మాయితో నా సినిమాలో ఒక డాన్స్ చేయిస్తాను. . అమ్మాయి అందంగా వుంది. మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. జ్యోతి లక్ష్మి గారి కి సినిమాలు తగ్గాయి. పైగా పెళ్లి కూడా కుదిరింది. పెద్ద కుటుంబం నడపాలి. అందుకే సరే అన్నది. అలమేలుమంగ కు అమ్మ అంటే చాల ఇష్టం, ఆమె మాట వేదం వాక్కు. అలమేలుమంగా పేరు పెట్టుకొని అలాటి నృత్యాలు చెయ్యడం బాగుండదు కదా. అందుకే పేరు మార్చారు. అప్పటికే డ్రీం గర్ల్ అని పేరు తెచ్చుకున్న హేమమాలిని పేరు తీసుకొని, జయ ను కలిపి జయమాలిని అనే పేరు పెట్టి 1975 లో ఆడదాని అదృష్టం సినిమాలో తొలిసారిగా నాట్యం చేయించారు. జయమాలిని కి సిగ్గు ఎక్కువ. షూటింగ్ కు అమ్మ ను కూడా తీసుకొని వెళ్ళేది. ఎవరితోనూ పెద్దగా మాట్లాడేది కాదు. చిత్రం ఏమిటంటే షూటింగ్ లో లైట్స్ ఆన్ అని అనగానే పూర్తిగా మారిపోయి, నాట్యం లో మునిగిపోయేది. లైట్స్ ఆఫ్ అనగానే మాములు గ మారిపోయేది. కొద్దీ కాలం లోనే బిజీ డాన్సర్ గా మారింది. తెలుగు, తమిళ్, మలయాళం. కన్నడ, హిందీ సినిమాలలో దాదాపు 450 లో నటించింది. నందమూరి బాలకృష్ణ గారి మొదటి జోడి ఈమె. అన్నదమ్ముల అనుబంధం చిత్రం లో బాలకృష్ణ కు జోడి గా నటించింది. జగన్మోహిని సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా విడుదల అయినా రోజునే రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయినా, జగన్మోహిని వాటికి మించి విజయవంతం అయి కలెక్షన్స్ ససాధించటం ఒక విశేషం. ఆ రోజుల్లో ఆమె పాపులారిటీ ఎంత వుండిందంటే, సినిమా డిస్ట్రిబ్యూటర్స్, ఫైనాన్సియర్స్ మీ సినిమాలో జయమాలిని డాన్స్ వుందా? లేదంటే పెట్టండి అనే శాసించే స్థాయిలో ఉండేది. , తెలుగు లో తన అభిమాన నటుడు ఎన్టీఆర్ గారని , వారి తో తాను నటించిన అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయని చెప్పారు. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యత తీసుకున్న జయమాలిని తన అయిదుగురు అక్కలకు, అన్నయ్య కు తానే పెళ్లి చేసింది. తన అన్నయ్య స్నేహితుడైన పార్తీబన్ అనే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ను పెళ్లి చేసుకొని, సినిమాలు మానుకొని గృహిణి గా భాద్యతలు తీసుకున్నది. ఆమె కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. జయమాలిని కి దైవ భక్తి ఎక్కువ. ప్రతి రోజు నిష్టగా పూజ చేసుకుంటుంది, ప్రతి శుక్రవారం, శనివారం గుడి కి వెళుతుంది. చాల ఏళ్ళ విరామం తరువాత, ఇప్పుడు మల్లి నటించాలని కోరుకుంటున్నది. డాన్స్ లు చెయ్యనని, మంచి పాత్ర దొరికితే తన లోని నటి ని చూపిస్తానని అంటుంది. ఆమె కోరిక తీరాలని, మల్లి నటి గా రాణించాలని కోరుకుందాం.
అలనాటి అందాల తార జయమాలిని మళ్లీ వస్తానంటోంది
Related tags :