Politics

అక్రమ ఆయుధాల కేసులో వల్లభనేని వంశీపై నాన్‌బెయిలబుల్ వారెంట్

illegal weapons case on vallabhaneni vamsi

????????????☘?????????☘???????????????☘????????????
కృష్ణా జిల్లా గన్నవరం తెదేపా అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది. వంశీపై 2009లో ఆయుధాల చట్టం కింద కేసు నమోదైంది. తనకు ప్రభుత్వ రక్షణ వద్దని.. ప్రైవేటు భద్రతను వంశీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో వంశీ వద్ద అక్రమ ఆయుధాలు లభించాయని అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు వంశీ హాజరుకాకపోవడంతో తాజాగా కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దీనిపై వంశీపై స్పందించారు. ఈ కేసును 2013లోనే హైకోర్టు కొట్టివేసిందని.. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. హైకోర్టు తీర్పు ప్రతిని నాంపల్లి కోర్టుకు నివేదిస్తానని వంశీ తెలిపారు.