Fashion

బొగ్గుతో మొహం రుద్దుకోండి. మెరిసిపోతారు.

Latest Telugu Fashion & Beauty Tips | Use Activated Charcoal For Cleansing

మీకు తెలుసా… బొగ్గు (యాక్టివేటెడ్‌ చార్‌కోల్‌)ను సైతం చర్మ సంరక్షణకు ఉపయోగించొచ్చు. దీంతో వేసుకునే కొన్ని పూతలు చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా మారుస్తాయి.
* రోజంతా దుమ్ము వాతావరణంలో ఉంటే స్వేద రంధ్రాలు మూసుకుపోయి… అవి మరింత పెద్దవిగా కనిపిస్తాయి. మీ ఫేస్‌ మాస్క్‌లో కొద్దిగా బొగ్గుపొడిని ఉపయోగిస్తే అది మృతకణాలను తొలగిస్తుంది. మురికి బయటకు వచ్చేలా చేస్తుంది.
* చాలామందిని జిడ్డు చర్మం ఇబ్బంది పెడుతుంది. ఇలాంటివారు యాక్టివేటెడ్‌ చార్‌కోల్‌ ఉపయోగించిన మాస్క్‌, క్లెన్సర్‌ని వాడితే అతిగా విడుదలయ్యే నూనెలు తొలగిపోతాయి. చర్మం మృదువుగానూ కనిపిస్తుంది. సహజ నూనెలూ కోల్పోకుండా ఉంటాయి.
* శరీరానికి ఏవైనా గాయాలైనప్పుడు కొన్ని రోజులకు అక్కడ ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. పూతకు ఉపయోగించే బొగ్గుపొడికి కాసిని నీళ్లు కలిపి మిశ్రమంలా చేయాలి. గాయాలు, ఇన్‌ఫెక్షన్‌ అయిన చోట దీన్ని పూతలా వేస్తే ఫలితం ఉంటుంది. వాపూ తగ్గుతుంది.
* పళ్లు పచ్చగా కనిపిస్తున్నాయా… కొద్దిగా బొగ్గుపొడిలో వంటసోడా కలిపి ఈ మిశ్రమంతో పళ్లు తోముకోండి. ఇలా వారానికోసారి చేస్తుంటే పళ్లు ముత్యాల్లా మారతాయి.