Politics

కేసీఆర్ కన్ను పడింది

Revanth Reddy Criticizes KCR Over TSRTC Strike

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నిరోజులుగా తమ డిమాండ్లు పరిష్కరించాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. రూ. 85 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్‌ కన్నేశారన్నారు. ప్రభుత్వంతో కొట్లాడి ఆర్టీసీ కార్మికులు హక్కుల సాధించుకోవాలన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు. రేపటి బంద్‌లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని రేవంత్ పిలుపునిచ్చారు.