చంద్రబాబు ఎన్నికలలో ఓడిపోవాలని వైఎస్.జగన్ ముఖ్యమంత్రి కావాలని వారంతా కలలు కన్నారు. ఆయనపై విమర్శలు, ఆరోపణలు ఎక్కువగా చేస్తుండేవారు. చివరకు వారు కోరుకున్నట్టే టిడిపి ఎన్నికలలో ఘోర ఓటమిని చవిచూసింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఐదుగురిలో ఒకరు తనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశపడ్డారు. ఒకరు వైకాపా తరపున అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. మరో ఇద్దరు ఏదో ఒక పదవి వస్తుందని ఆశించారు. ఇంకొకరేమో తనకు జగన్ ప్రాధాన్యత ఇస్తారని నమ్మారు. ఈ ఐదుగురి కలలు కల్లలు అయ్యాయి.
* చంద్రబాబు తోడల్లుడు డా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబును పతనం చేయాలని కంకణం కట్టుకున్నారు. పరుచూరి నుంచి వైకాపా ఎమ్మెల్యే అభ్యదిగా పోటీ చేసి అధికారానికి కొద్ది తేడాలో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు దగ్గుబాటి పురంధేశ్వరిని తీసుకుని వైకాపాలోకి రావాలని లేకపోతే అసలు వైకాపాలో నుండే బయటకు పోవాలని పొగపెడుతున్నారు.
* లక్ష్మిపార్వతి, పోసాని కృష్ణ మురళి (సినీనటుడు), మోహన్ బాబు, కొమ్మినేని శ్రీనివాసరావు నలుగురు చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారే.
* టిటిడి ఛైర్మన్ పదవి వస్తుందని ఆశించిన మోహన్‌బాబుకు జగన్ మొండి చేయి చూపారు. ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్‌పై తిరుపతిలో మంచువారి హడావుడి ఎవరూ మరిచిపోలేరు. జగన్ తనకు దగ్గర బంధువైన సుబ్బారెడ్డికి తితిదే ఛైర్మన్ సీటు కట్టబెట్టారు.
* పోసాని తనకు SVBC ఛైర్మన్ పదవి ఇస్తారని ఆశించి బోల్తాపడ్డారు. ఆ పదవిలో మరో సినీనటుడు పృథ్వీరాజ్‌ను నియమించారు
* సాక్షి పత్రిక, ఛానెల్‌లో పనిచేసే వారికి కేబినెట్ హోదాగల పదవులు లభించినప్పటికీ కొమ్మినేని శ్రీనివాసరావును మాత్రం సీఎం పరిగణనలోకి తీసుకోలేదు.
* ఇక లక్ష్మీపార్వతి సరే సరి. మొదట ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అది అందకపోగా ఎమ్మెల్సీ విత్ మంత్రి ఆశించారు. దానికి కూడా దిక్కు లేకుండా పోయింది.
కమ్మసామాజికవర్గానిక చెందిన వారికి నామిటేడ్ పదవుల పందేరం ఇప్పటికే జగన్ పూర్తి చేశారు. కానీ ఆ జాబితాలో ఈ అయిదుగురికి ఎందుకు మొండిచేయి లభించిందనేది అంతుబట్టని విష్యం. వీరితో పార్టీకి ఏమి ప్రయోజనం లేదని జగన్ భావించారా? లోగుట్టు పెరుమాళ్లకెరుక.