ఫిలడెల్ఫియా కాలేజ్‌విల్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కార్యవర్గ సంఘం సమావేశాలు శనివారం ఆదివారం జరిగాయి. తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన, బోర్డు చైర్మన్ హరీష్ కోయ, కార్యదర్శి రవి పొట్లూరి, ఫౌండేషన్ కార్యదర్శి రవి మందలపు, ఫౌండేషన్ అధ్యక్షుడు నిరంజన్, తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, గంగాధర్ నాదెళ్ల, హనుమయ్య బండ్ల, జంపాల చౌదరి, పంత్ర సునీల్, వేమన మల్లికార్జున తదితరులు హాజరయ్యారు. తానా చేపడుతోన్న కార్యక్రమాలపై సమీక్ష అనంతరం భవిష్యత్ కార్యక్రమాల గురించి చర్చించారు. శనివారం సాయంత్రం కాలేజీవిల్ పెర్కియోమెన్ స్కూల్ లో తానా మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక ఉత్సవంలో తానా కార్యవర్గం పాల్గొంది. ఈ వేడుకలో ప్రముఖ గాయనీ సునీత గీతాలాపన అలరించింది. 275 మంది ప్రవాసులు ఈ ఉత్సవంలో వివిధ ప్రదర్శనలతో 2వేలకు పైగా హాజరయిన అతిథులను ఆకట్టుకున్నారు. సెనేటర్ కేటీ మత్, స్టేట్ రిప్రజెంటేటివ్ జో వెబ్స్టర్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఫిలడెల్ఫియాలో తానా కార్యవర్గ సమావేశం-సాంస్కృతికోత్సవం
Related tags :