Devotional

తిరుమలలో రూ.10వేలకు వీఐపీ దర్శనం

TTD Opens VIP Break Darshan If You Pay 10000Rupees

రాష్ట్రంలో ఆలయాల నిర్మాణం, ధూపదీప నైవేద్యాలను కొనసాగించడమే లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్టును సోమవారం నుంచి ప్రారంభించిందని అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ట్రస్టు వివరాలను ఆయన వెల్లడించారు. ఈ ట్రస్టు గోకులం సముదాయంలోని జేఈవో కార్యాలయంలో సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చిందని, నెల రోజులుగా అధ్యయనం చేశాక ప్రారంభించామని చెప్పారు. ఇప్పటిదాకా ఈ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందినట్లు తెలిపారు. ‘ఈ ట్రస్టుకు రూ.10 వేలు విరాళం అందించిన భక్తుడికి ఒక వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ ఇస్తాం. ప్రొటోకాల్ మర్యాదలతో దర్శనం ఉంటుంది. భక్తులు ఇచ్చే విరాళం రూ.లక్ష దాటితే.. ఆ మేరకు ఇతర పథకాలపై ఉన్న హక్కులూ వర్తిస్తాయి. తితిదే యాప్, వెబ్సైట్ల ద్వారా రానున్న 15 రోజుల పాటు శ్రీవాణి ట్రస్టు ద్వారా వీఐపీ దర్శనం బుకింగ్ స్లాట్లో నమోదు చేసుకోవచ్చు. భక్తులు విరాళం అందించిన తేదీ నుంచి ఆరు నెలల్లోపు దర్శనం చేసుకోవచ్చు’ అని వివరించారు.
1. పంచాంగం 22.10.2019
సంవత్సరం: వికారి
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: శరద్
మాసం:ఆశ్వయుజ
పక్షం: కృష్ణ బహుళ
తిథి: నవమి రా.11:35 వరకు
తదుపరి దశమి
వారం: మంగళవారం (భౌమ వాసరే)
నక్షత్రం: పుష్యమి ప.01:55 వరకు
తదుపరి ఆశ్లేష
యోగం: సద్య, శుభ
కరణం: తైతిల
వర్జ్యం: రా.02:04 – 03:35
దుర్ముహూర్తం: 08:30 – 09:17
రాహు కాలం: 02:55 – 04:22
గుళిక కాలం: 12:00 – 01:27
యమ గండం: 09:05 – 10:33
అభిజిత్ : 11:37 – 12:23
అమృత కాలం: 10:29 – 12:01
సూర్యోదయం: 06:10
సూర్యాస్తమయం: 05:50
వైదిక సూర్యోదయం: 06:14
వైదిక సూర్యాస్తమయం: 05:46
చంద్రోదయం: రా.12:03
చంద్రాస్తమయం: ప.01:28
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కర్కాటకం
దిశ శూల: ఉత్తరం
చంద్ర నివాసం: ఉత్తరం
2. తిరుమల \|/ సమాచారం
ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు మంగళవారం,
22.10.2019
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుమల 19C°-23℃°
• నిన్న 66,025 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో 02
గదిలో భక్తులు వేచి
ఉన్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
06 గంటలు
పట్టవచ్చును,
• నిన్న 23,908 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 4.42 కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
గమనిక:
# ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
#ఈనెల 30 న చంటిపిల్లల
తల్లిదండ్రులకు శ్రీవారి
ప్రత్యేక ప్రవేశ దర్శనం
(ఉ: 9 నుండి మ:1.30
వ‌ర‌కు సుపథం మార్గం
ద్వారా దర్శనానికి
అనుమతిస్తారు,
#ఈనెల 29న వృద్ధులు,
దివ్యాంగులకు ప్రత్యేక
ఉచిత దర్శనం,
(భక్తులు రద్దీ సమయాల్లో
ఇబ్బంది పడకుండా ఈ
అవకాశం సద్వినియోగం
చేసుకోగలరు)
వయోవృద్దులు / దివ్యాంగుల
• ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు.
ఉ: 7 గంటలకి చేరుకోవాలి,
ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
• సుపథం మార్గం గుండా
శ్రీవారి దర్శనానికి
అనుమతిస్తారు, ఉ:11
నుండి సా: 5 గంటల
వరకు దర్శనానికి
అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి
ttd Toll free #18004254141
తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం
కోసం క్రింద లింకు ద్వారా చేరండి
https://t.me/joinchat/AAAAAEHgDpvZ6NI-F2C7SQ
3. శ్రీరస్తు శుభమస్తు
తేది : 22, అక్టోబర్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆశ్వయుజమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : భౌమవాసరే (మంగళవారం)
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం?
తిథి : నవమి
(ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 25 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 33 ని॥ వరకు నవమి తిధి తదుపరి దశమి తిధి)
నక్షత్రం : పుష్యమి
(నిన్న సాయంత్రం 5 గం॥ 32 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 38 ని॥ వరకు పుష్యమి నక్షత్రం తదుపరి ఆశ్లేష నక్షత్రం)
యోగము : (సాధ్యం ఈరోజు సాయంత్రం 7 గం ll 55 ని ll వరకు తదుపరి శుభం రేపు సాయంత్రం 4 గం ll 57 ని ll వరకు)
కరణం : (తైతుల ఈరోజు సాయంత్రం 4 గం ll 28 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు మధ్యాహ్నం 12 గం ll 0 ని ll)
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 14 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 46 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 10 గం॥ 29 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 1 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 5 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 10 గం॥ 33 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 20 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 20 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 27 ని॥ వరకు)
మగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 7 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 33 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 11 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 50 ని॥ లకు
సూర్యరాశి : తుల
చంద్రరాశి : కర్కాటకము
4. శుభోదయం
మహానీయుని మాట
” విజయం సాధించిన వ్యక్తిగా కాదు,
విలువలు కలిగిన వ్యక్తిగా మారడానికి ప్రయత్నించు ”
నేటీ మంచి మాట
” తన పొరపాట్ల నుంచే కాదు.
ఇతరుల వైఫల్యాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవడం వివేకవంతుల లక్షణం. ”
5. నేటి ఆణిముత్యం
పదవి కోసమెపుడు ప్రాకులాడకు మోయి
అర్హత గల యెడల యదియె వచ్చు
ఎవ్వరాపగలరు? యెదుగుదలనెపుడు
కష్టపడెడి వారు నష్టపోరు.

భావం:
అధికారం కోసం అర్రులు చాచకు.అర్హత ఉంటే అదేవస్తుంది. మనిషి ఎదుగుదలను ఎవరూ ఆపలేరు.కష్టపడేవాడు ఎప్పటికి నష్టపోడు.(కృషి తో నస్తి దర్భిక్షం)
6. నేటి సుభాషితం
ఎంత అరగదీసినీ గంధపుచెక్క పరిమళాన్ని కోల్పోదు. ఎన్ని కష్టాలెదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు.
7. నేటి జాతీయం
కొండను తవ్వి ఎలుకను పట్టు
అతి ప్రయాస కోర్చి చేసిన పని వలన అతి స్వల్ప ప్రయోజనం కూరితె కొండను త్రవ్వి ఎలుకను పట్టి నట్లు అంటారు.
8. నేటి సామెత
నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్లు
ఎంతటి బలవంతుడైనా కాలం కలిసి రాకపోతే ఒక్కోసారి కుక్కచావు చస్తాడని అర్థం.
9. షోడశోపచారాలు అంటే ఏమిటి?
దేవుడు , ప్రకృతి శక్తీ. ప్రకృతి లో ఉండే ప్రతి భాగమందు నిండి యున్నాడు. మీరు ఏ రూపమున ధ్యానించిన, ప్రార్ధించిన ఆ రూపమున మిమ్ములను ఆదుకొనును . మీరు చేయు కార్యములందు, మీ జీవనమునందు , మీకు తోడై, నీడై మిమ్ములను రక్షించును. దేవుని యెడల విశ్వాసము లేకుండా … సంస్కృతి, పూజలు, ప్రార్ధనలు, సంప్రదాయాలు పాటించిన వ్యర్ధము, నిరుపయోగము. కావున అందరు మొదట దేవుని యెడల నమ్మకము, భక్తి కలిగి ఉండవలెను , తప్పనిసరి అదే శ్రేయస్కరము. మీరు చేయవలసిన పని, ప్రయత్న లోపము లేకుండా చేయండి, ఫలితము భగవంతునికి వదిలి వేయండి. మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ ప్రతిఫలము పొందుటకు, భగవంతుడిని ఆరాధించండిభగవంతునికి చేయు ఉపచారాలే షోడశోపచారాలు………భగవంతునికి చేయు సేవలే షోడశోపచారాలు.
ఈ సేవల యందు భగవంతుని మనం అతిధి గా భావిస్తాము. ఇవి 16—-భక్తుడు తన ఆత్మ తృప్తి కోసం, అంత మహా శక్తీ ని దగ్గరనుండి సేవించే శక్తీ లేక, భగవంతుని ఆత్మ రూపాన, ప్రసన్నం చేసుకుని, సేవించుటయె షోడశోపచారాలు.
1. ఆహ్వానించుట = ఆవాహనం అనే ఉపచారం.
2. ఆసన ఇవ్వటం = ఆసనం అనే ఉపచారం.
3. కాళ్ళకు నీళ్ళు ఇవ్వటం = పాద్యం అనే ఉపచారం.
4. చేతులకు నీళ్ళు ఇవ్వటం = అర్ధ్యం అనే ఉపచారం.
5. త్రాగుటకు నీళ్ళు ఇవ్వటం = ఆచమనీయం అనే ఉపచారం.
6. స్నానమునకు నీళ్ళు ఇవ్వటం = స్నానం అనే ఉపచారం.
7. వస్త్రం ఇవ్వటం = వస్త్రం అనే ఉపచారం.
8. యజ్ఞోపవీతం ఇవ్వటం = యజ్ఞోపవీతం అనే ఉపచారం.
9. గంధం ఇవ్వటం = ఇదొక, ఉపచారం.
10. పుష్పం ఇవ్వటం =ఇదొక ,ఉపచారం.
11. సుగంధం కొరకు ధూపం = వేరొక ఉపచారం.
12. దీపం వెలిగించటం ( మంగళ హారతి ) = ఇదొకఉపచారం.
13. నైవేద్యం సమర్పించటం = వేరొక ఉపచారం.
14. తాంబూలాన్ని సమర్పించటం = వేరొక ఉపచారం.
15. నమస్కారం సమర్పించటం = ఇదొక ,ఉపచారం.
16. ఉద్వాసనం సమర్పించటం =ఇదొక ,ఉపచారం .
వీటితో పూజ ముగియును . ఇవన్ని భక్తి శ్రేద్దలతో చేసేవి కాని యాంత్రికం గా చెేసేవికావు.
10. రాశిఫలం-22/10/2019
తిథి:
బహుళ నవమి రా.10.56, కలియుగం-5121 ,శాలివాహన శకం-1941
నక్షత్రం:
పుష్యమి మ.1.14
వర్జ్యం:
రా.1.19 నుండి 2.49 వరకు
దుర్ముహూర్తం:
ఉ.08.24 నుండి 09.12 వరకు, తిరిగి రా.10.48 నుండి 11.36 వరకు
రాహు కాలం:
మ.3.00 నుండి 4.30 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. ఆర్థిక ఇబ్బందులనెదుర్కొంటారు. అనారోగ్య బాధవలన బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ఆకస్మిక ధనలాభయోగముంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణమేర్పడుతుంది. స్ర్తిలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్తవహించుట మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతోపాటు మానసికాందోళన తప్పదు. చిన్న విషయాలకై ఎక్కువ శ్రమిస్తారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఋణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయ ప్రయాసలుంటాయి. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. మానసికాందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) కళాకారులకు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) ఋణప్రయత్నాలు ఫలిస్తాయ. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండవు. మానసికాందోళన చెందుతారు. స్ర్తిలకు స్వల్ప అనారోగ్య బాధలుంటాయ బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తపడుట మంచిది.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆరోగ్యం గూర్చి జాగ్రత్తపడుట మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా వుంటే మేలు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున మానసికాందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా నుండుట మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) పిల్లలవల్ల ఇబ్బందులనెదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) అనుకోకుండా కుటుంబంలో కలహాలేర్పడే అవకాశముంటుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడుట మంచిది. మనస్తాపానికి గురిఅ
11. *చరిత్రలో ఈ రోజు* అక్టోబర్, 22*
సంఘటనలు*
1764: బక్సర్ యుద్ధం జరిగింది. బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ కి, బెంగాలులో మొగలుల పాలకుడు మీర్ కాసిం సేనలకు మధ్య జరిగిన ఈ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచి, భారత్‌లో తన అధికారాన్ని స్థిరపరచుకుంది. కంపెనీ సేనలకు హెక్టర్ మన్రో నాయకత్వం వహించాడు.
1879: బ్రిటిషు వారు మొట్ట మొదటి రాజద్రోహ నేరాన్ని నమోదు చేసారు. వాసుదేవ బల్వంత ఫడ్కే మొదటి ముద్దాయి.
1953: లావోస్ ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందినది.
1960: మాలి ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందినది.
1963: భాక్రా నంగల్ ఆనకట్టను ప్రధాని నెహ్రూ జాతికి అంకితం చేసాడు.
1966: సోవియట్ యూనియన్ లూనా 12 అంతరిక్ష నౌక ను ప్రయోగించింది.
1975: సోవియట్ యూనియన్ ప్రయోగించిన మానవరహిత అంతరిక్ష మిషన్ వెనెర-9 శుక్రగ్రహంపై దిగింది.
1981: పారిస్-లియాన్‌ ల మధ్య టిజివి రైలు సర్వీసు ప్రారంభమైనది.
2008: భారతదేశం తొలి మానవరహిత చంద్రమండల నౌక చంద్రయాన్-1ను ప్రయోగించింది.
2015 : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి, ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా శంకుస్థాపన ఉద్దండరాయుని పాలెంలో జరిగింది.
జననాలు*
1894 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సంపాదకుడు కోలవెన్ను రామకోటీశ్వరరావు (మ.1970).
1900 : భారతీయ స్వంతంత్ర సమరయోధుడు అష్ఫాకుల్లా ఖాన్ (మ.1927).
1901: కొమురం భీమ్ హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవంశమునకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (మ.1940)
1934 : పేదల పక్షపాతిగా, నిస్వార్థ సేవకునిగా పేరొందిన మాజీ ఐఎఎస్ అధికారి ఎస్‌.ఆర్‌.శంకరన్‌ జననం (మ.2010)
1949 : ఫ్రాన్సు దేశానికి చెందిన ఒక ఫుట్ బాల్ నిర్వాహకుడు ఆర్సేన్ వెంగెర్ .
1964: ప్రస్తుత భారత దేశ హోంశాఖ మంత్రి, బిజేపి నాయకుడు అమిత్ షా.
మరణాలు*
1996:పండిత గోపదేవ్, సంస్కృతములో మహాపండితుడు, ఆర్యసమాజ స్థాపకుడు, వైదికథర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు. (జ.1896)
12. తిరుపతి తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గిపోయింది. సెలవులు ముగియడంతో భక్తుల తాకిడి అంతంత మాత్రంగా ఉంది. భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. టైంస్లాట్ సర్వ, దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
13. నెమలి వేణుగోపాలుని ఆలయానికి రూ.లక్ష వితరణ
జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గంపలగూడెం మండలం నెమలిలోని వేణుగోపాలస్వామి ఆలయానికి జగ్గయ్యపేటకు చెందిన గుంటుపల్లి వెంకటప్రసాద్‌ రూ.లక్ష వితరణగా అందజేశారు. దాత తల్లిదండ్రులైన గురునాథం, నారాయణమ్మ సోమవారం ఆలయంలో సహాయ కమిషనర్‌ నేల సంధ్యకు తమ వితరణ నగదును అందజేశారు. తమ విరాళాన్ని ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకు వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులు స్వామివారి మూలవిరాట్‌ను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు గోపాలాచార్యులు వారిని వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. దాత కుటుంబానికి ఆలయ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
14. తిరుపతమ్మ ఆలయంలో చేతివాటం
తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో ఉప ప్రధాన అర్చకుడి చేతివాటం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజులుగా ఆలయ అధికారులు గోప్యంగా ఉంచుతూ పోలీసులతో విచారణ చేయిస్తున్న విషయం సోమవారం బహిర్గతమైంది. ప్రధాన ఆలయంలో ఉప ప్రధాన అర్చకుడు మర్రిబోయిన ద్వారకరావు విధులు నిర్వర్తిస్తుండగా అమ్మవారికి భక్తులు ఇచ్చిన బంగారు వస్తువులు కాజేసినట్లు ఆలయ అధికారులు గుర్తించారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనను విధుల నుంచి తప్పించారు. ఆలయ ఏఈవో జంగం శ్రీనివాస్‌ తెలిపిన వివరాల మేరకు ఈనెల 19వ (శనివారం) తేదీన ఉదయం 10 గంటల సమయంలో కొందరు భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఆ సమయంలో ఉప ప్రధాన అర్చకుడు మర్రిబోయిన ద్వారకరావు విధుల్లో ఉన్నారు. భక్తులు అమ్మవారికి బంగారు గాజులు, ముక్కుపుడక, వెండి పళ్లెం కానుకగా అందజేశారు. వాటిని హుండీలో వేయకపోవడంతోపాటు, విధుల్లో ఉన్న ఆలయ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారమివ్వలేదు. ఆయా వస్తువులను ఇంటికి తీసుకెళ్లారు. అదే రోజు మధ్యాహ్నం ఆలయంలో ఒక భక్తుడి బంగారు ఉంగరం పడిపోయింది. ఈ విషయమై ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఈక్రమంలో ప్రధాన ఆలయంలో ఉప ప్రధాన అర్చకుడు బంగారు వస్తువులను భక్తుల నుంచి తీసుకొని సంచిలో పెట్టుకొని ఇంటికి వెళ్లినట్లు గుర్తించారు. విషయాన్ని ఈవో శోభారాణి దృష్టికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి ద్వారకరావుపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ద్వారకరావును విచారణ చేయగా ఆయన వద్ద ఉన్న బంగారు వస్తువులను అప్పగించారు.