నా గురించి నేను చెప్పేంత వరకు ఎవరేం విన్నా అదంతా ఒట్టి వదంతి తప్ప, అందులో ఎలాంటి నిజం ఉండదంటోంది కియారా అడ్వాణీ. హిందీ, తెలుగు భాషల్లో కథానాయికగా కొనసాగుతోంది కైరా. తెలుగులో తక్కువే కానీ… హిందీలో ప్రతి కథానాయికపైనా రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉంటాయి. ప్రేమ విషయంలో మీ గురించి వినిపించే వదంతులపై ఎలా స్పందిస్తుంటారని అడిగితే.. విని వదిలేయడమే అని జవాబిస్తోంది. ‘‘ప్రేమపైనా, వివాహ వ్యవస్థపైనా నాకు విశ్వాసం ఉంది. నిజంగా నేనొక బంధంలో ఉన్నానంటే దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తా. దాన్ని దాచిపెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ప్రేమ గురించి నా అంతకు నేను చెప్పే వరకు ప్రేమలో పడనట్టే’’ అంది కియారా. తప్పుడు ప్రచారాలు ఎప్పుడూ కోపం తెప్పించలేదా? అని అడిగితే… ‘‘ఆకలైతే తప్ప నాకు దాదాపుగా కోపం రాదు. నేను కోపంగా ఉన్నానంటే ఇంట్లో వాళ్లు ఏదో ఒకటి తినమని తెచ్చి పెడుతుంటార’’ని తెలిపింది కియారా.
ఆకలి కోపాలు
Related tags :