వెజిటబుల్ ఆయిల్స్లో కొలెస్ట్రాల్ ఉండదు కదా! సో… ఎంత తిన్నా గుండెకు పర్వాలేదా? ఏ ఆయిల్ హార్ట్ ఎటాక్ రాకుండా చేస్తుందో చెప్పండి. మా ఇంట్లో గత ఐదు తరాల నుంచి హార్ట్ ఎటాక్ చరిత్ర ఉంది. వెజిటబుల్ ఆయిల్స్లో కొలెస్ట్రాల్ ఉండదనేది కరెక్టే కానీ అతిగా ఆయిల్స్ (కొవ్వు పదార్థం) తీసుకుంటే శరీరంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది. ముఖ్యంగా పొట్ట భాగంలో. దీనివల్ల ఉదర భాగంలో ఉన్న ఆర్గాన్స్కి ప్రమాదమే. ప్రత్యేకంగా ఒక ఆయిల్ తీసుకుంటే హార్ట్ ఎటాక్ రాదనేది ఏమీ లేదు. హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే చాలా పద్ధతులు పాటించాలి. అవి ఏమిటంటే…ఆయిల్స్ రెండు మూడు రకాలు వాడాలి. ఉదాహరణకు పప్పులో ఒక ఆయిల్, కర్రీ కోసం ఒక ఆయిల్… ఇలా వాడితే మంచిది. ఏ ఆయిల్ వాడినా రోజుకు 30 గ్రాములకు మించకుండా ఉండాలి. రిఫైండ్ ఆయిల్స్ తక్కువగా వాడితే మంచిది. బేకరీ ఫుడ్, బిస్కట్లలో హైడ్రోజినేటేడ్ ఆయిల్ (వనస్పతి, మర్గిరిన్ వంటివి) వాడతారు కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. వారానికి రెండు లేదా మూడుసార్లు వైట్ ఫ్యాటీ ఫిష్ తినాలి. శాకాహారులు బాదం, అవిసెలు క్రమం తప్పకుండా తినొచ్చు. ఏదైనా సరే మోతాదు మించకూడదు.ఉప్పు ఒక టీ స్పూను కన్నా ఎక్కువ వాడకూడదు. నిల్వ ఉన్న ఆహారపదార్థాల్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని తగ్గించాలి.చక్కెర రెండు స్పూన్ల కన్నా ఎక్కువ తీసుకోకూడదు. అధిక చక్కెర ఉన్న పదార్థాలు క్యాలరీలను పెంచుతాయి. అందుకే స్వీట్స్, చక్కెర ఉన్న పదార్థాలను బాగా తగ్గించాలి.రోజుకు 500 గ్రాములకు మించి పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.ప్రతీరోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయాలి.కంటినిండా నిద్ర పోవాలి.ప్రతి చిన్న దానికి బీపీ పెంచుకుని, లేనిపోని తగాదాలు, చర్చల అవసరం లేదని గుర్తించాలి
*** గోధుమలతో ఈ వ్యాధులు దూరం
రోజు వారీగా తీసుకునే ఆహారంతో మన ఆరోగ్యం ముడిపడి ఉంది. మంచి ఫుడ్ తో ఎలాంటి వ్యాధుల్లేకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. ఇందులో గోధుమలు కీలకం. వీటితో మంచి పోషకాలు ఉండే లభించడంతో పాటు..రోగాల భారిన పడకుండా మనల్ని మనం కూడా కాపాడుకోచ్చు. జీవితాంతం ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతాయి.ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో గోధుమను కనీసం మూడు కప్పులు ఉండేలా చూసుకోవాలి. దీంతో ఏ వ్యాధి మన దరికి చేరదు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ను అదుపులో ఉంచేందుకు గోధుమలు చాలా ముఖ్యమైన ఆహారంగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మహిళలు రోజువారీ 30 గ్రాముల గోధుమ ఆహారం సరిపోతుంది. గోధుమలతో దాదాపు 50 శాతం ఆస్తమా అవకాశాలను తగ్గిస్తుంది. గోధుమల్లో ప్లాంటు లిగ్నన్స్, ఒక రకం ఫైటో ట్యూయూరియంట్,ఎక్కువగా ఉంటుంది. ఇవి గుండెకు సంబంధించిన వ్యాధులకు వ్యతిరేకంగా పని చేస్తాయి.గోధుమల్లో ప్రోటీన్లు,విటమిన్లు ఖనిజాలతో పాటు మనకు అవసరమైన ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. గోధుమలకు బరువును నియంత్రించే సహజ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఓబెసిటీ ఉన్న వారికి గోధుమ బెటర్ ఛాయిస్.డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుకోవడానికి గోధుమల ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుంది.గోధుమ ఉత్పత్తులలో లభించే ఎక్కువ ఫైబర్ రక్తపోటు స్థాయిని తగ్గించటానికి సహాయపడుతుంది. దీని ద్వారా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.గోధుమలు మృదువైన పేగులకు రక్షణను అందిస్తుంది. పైల్ ఆమ్ల స్రావాన్ని తగ్గిస్తుంది. అధిక పిత్త ఆమ్లాలు, పిత్తాశయ రాళ్లకు ప్రధాన కారణమవుతుంది. అంతేకాకుండా గోధుమను ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీంతో రక్తంలో ట్రెగ్లిజెరైడ్స్ లేదా కొవ్వును తగ్గిస్తుంది.
*** ఔషధగుణాల తులసి
తులసి ప్రతి ఇంట్లో ఎంతో పవిత్రంగా పెంచుకునే మొక్క. హిందువులు లక్ష్మీదేవి రూపంగా తులసి మొక్కను కొలుస్తారు. విదేశాల్లో కూడా తులసిమొక్కను భారతీయులు ఇంటి ముందు కోటగా కట్టి కొలుచుకుంటారు. తులసిని పెంచి.. ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి.తులసి ఆకుల వల్ల మనం చాలా జబ్బుల్ని దూరం చేసుకోవచ్చు. తులసిలో విటమిన్ ఏ, సీ, కే తోపాటు క్యాల్షియం, జింక్, ఐరన్, క్లోరోఫిల్ సమృద్ధిగా లభిస్తాయి. అందుకే ఈ మొక్కను మందుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీని ఆకులు, పువ్వులు, గింజలు అన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.తులసి మొక్కకు పూసే తాజా పూలు బ్రాంకైటిస్ సమస్యను దూరం చేస్తాయి. మలేరియా ఉన్నవారు ఈ మొక్క ఆకులు, గింజల్ని మిరియాలతో కలిపి తీసుకోవాలి. డయేరియా వికారం, వాంతులు వచ్చేవారు తులసి ఆకుల్ని తింటే మంచిది.కడుపులో అల్సర్లు, కళ్ల సమస్యలకు ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది. చర్మంపై మొటిమలు, మచ్చల్ని తులసి మటుమాయం చేయగలదు. డయాబెటిస్ ఉన్నవారికి తులసి చక్కటి విరుగుడులా పనిచేస్తుంది. రకరకాల క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడుతుంది.రోజూ రెండు తులసి ఆకుల్ని తింటే బీపీ అదుపులో ఉంటుంది. శరీరంలో అతి ఖ్యమైన అవయవాల్లో ఒకటైన కాలేయాన్ని కాపాడుతుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతూ మానసిక ఒత్తిళ్లను తగ్గిస్తుంది. శ్వాస కోశ సంబంధ సమస్యల్ని దూరం చేస్తుంది. దంతాలను కాపాడుతుంది.తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు బాగా ఉన్నాయి. రోజూ తులసి ఆకుల్ని తింటే శరీరంలో మంటలు, నొప్పులు, వాపులు, దురదల్ని తగ్గిస్తుంది. ఎముకల నొప్పుల నుంచి వేగంగా సాంత్వననిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా సహకరిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.తులసి ఆకుల రసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్గా ఇది పనిచేస్తుంది. రేడియేషన్ దుష్పరిణామాలు శరీరంపై పడకుండా పరిరక్షిస్తుంది. జుట్టు సమస్యలకు తులసి అద్భుత పరిష్కారంగానూ పనిచేస్తుంది.