DailyDose

సబ్‌జైలు గోడ దూకి నలుగురు ఖైదీల పరార్-నేరవార్తలు-10/27

Four Criminals Escape From Sub Jail-Telugu Crime News Today-10/27

* టిక్‌టాక్ పరిచయం పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. భార్య ఉండగానే టిక్‌టాక్‌లో మరో మహిళతో భర్త పరిచయం పెంచుకున్నాడు. అంతటితో ఆగక.. వారి పరిచయం పెళ్లి దాకా వెళ్లింది. పరిచయమైన మహిళను భార్యకు తెలియకుండా తిరుపతికి తీసుకెళ్లి ఆ భర్త పెళ్లిచేసుకున్నాడు. విజయవాడకు చెందిన వీటీపీఎస్ ఉద్యోగి సత్యరాజు చేసిన నిర్వాకమిది. పెళ్లి విషయం ఇంట్లో తెలియడంతో భార్యను హత్య చేసేందుకు సత్యరాజు ప్లాన్ చేశాడు. అయితే.. అదృష్టవశాత్తూ ఆ భార్య భర్త పన్నాగాన్ని పసిగట్టి.. అతని నుంచి తప్పించుకుని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది…

* తమిళనాడులో మూడేళ్ల చిన్నారి బోరుబావిలో పడ్డాడు. అతడిని బయటకు తీసేందుకు రెండు రోజులుగా సహాయక బృందాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. తిరుచిరాపల్లి జిల్లాలోని నాడుకట్టుపల్లిలో శుక్రవారం సుజిత్‌ విల్సన్‌ అందులో పడ్డాడు. తన ఇంటికి సమీపంలో ఆడుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పైపుల ద్వారా అతడికి ఆక్సిజన్‌ అందిస్తున్నారు. బోరుబావిలోని బాలుడు  90 అడుగులలోతులో ఉన్నాడు. ఆ బోరుబావి మొత్తం లోతు 600 అడుగులు ఉందని తెలిసింది. దానికి సమాంతరంగా గోతిని తవ్వి అతడిని బయటకు తీసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యల్లో ఐఐటీ మద్రాస్ కు చెందిన నిపుణులతో పాటు మరో 6 బృందాలు పాల్గొంటున్నాయి…

* మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జైలు లో ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వీరేశ్ అనే ఖైదీ శనివారం అర్థరాత్రి జిల్లా జైలు బ్యారక్ గదిలో పైన ఉన్న వెంటిలేటర్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు జైలు అధికారులు తెలిపారు. ఖైదీని జోగులాంబ గద్వాల్ జిల్లా కెటిదొడ్డి మండలం పాత పాలెం గ్రామానికి చెందిన ఉరబాయ్ వీరేశ్ (29)గా గుర్తించారు.  వీరేశ్ పై అత్యాచరం కేసు నమోదైంది. ఈ కేసులో  వీరేశ్ కు బెయిల్ రాలేదు. వీరేశ్ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని జైలు అధికారులు వెల్లడించారు. శవ పరీక్ష నిమిత్తం వీరేశ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

* వసతి గృహ అధికారులేమో.. ఇంటికి వెళ్లారనుకున్నారు.. తల్లిదండ్రులేమో.. హాస్టల్​లోనే ఉన్నారుకున్నారు. వచ్చి చూసిన తండ్రికి మాత్రం విద్యార్థులు కనిపించలేదు. ఇంతకీ ఆ పిల్లల పరిస్థితి ఏమైంది? హాస్టల్​ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థులు ఏమయ్యారు?ఎక్కడకు వెళ్లాలనుకున్నారు ? అసలేమైంది..? ఆ ఇద్దరు విద్యార్థులు చనిపోయారన్న సంగతి వసతి గృహ అధికారులకు.. తల్లిదండ్రులకూ తెలియదు. ఓ విద్యార్థి తండ్రి వసతి గృహంలో చదువుకుంటున్న కొడుకును పలకరించాలని వచ్చాడు. కానీ… ఆ తండ్రికి వసతి గృహ అధికారులు చెప్పిన మాటలు విని ఏం జరిగిందో అర్థం కాలేదు. తన బిడ్డ హస్టల్​లోనే ఉన్నాడంటూ.. ఇంటికి రాలేదంటూ ఆందోళన చెందాడు. అనంతరం ప్రకాశం జిల్లా చీమకుర్తి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు. అప్పుడు భయంకరమైన చేదు నిజం బయటపడింది.

* రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైవే పక్కన నిస్సహాయ స్థితిలో పడిఉన్న ఓ మహిళను అదే మార్గంలో వస్తున్న గూడూరు సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ గమనించి తన వాహనంలో ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. ఈ ఘటన మనుబోలు మండల పరిధిలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు..ఇందుకూరుపేటకు చెందిన ఇటుకల ప్రసన్న తన తమ్ముడు చందుతో కలిసి మోటార్‌బైక్‌పై గూడూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో మనుబోలు పోలీస్‌స్టేషన్‌ సమీపంలో మోటారుసైకిల్‌పై వెనకగా కూర్చుని ఉన్న ప్రసన్న అదుపుతప్పి కింద పడిపోయింది. ఇది గమనించని సోదరుడు ముందుకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తరువాత అదే మార్గంలో నెల్లూరు నుంచి గూడూరు వస్తున్న సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ హైవే పక్కన పడిపోయి ఉన్న ప్రసన్నని గమనించి వాహనం ఆపారు. గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న ప్రసన్నను తన సిబ్బంది సాయంతో వాహనంలో మనుబోలు పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ…

* సింగణమల నియోజకవర్గ పరిధిలో బుక్కరాయసముద్రం మండలానికి చెందిన వెంకటాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కి చెందిన కురుబ నాగరాజు ఇంటికి అడ్డంగా వైస్సార్సీపీ గ్రామ స్థాయి నాయకుడు వెంకటనారాయణ రెడ్డి గోడ కట్టి ఇంటిలోకి వెళ్లకుండా భయబ్రాంతులకు గురిచేయడం జరిగింది బాధితుడు విషయాన్ని బుక్కరాయసముద్రం పోలీస్ లకు చెప్పిన వినకుండా అధికార పార్టీ కి కొమ్ము కాస్తుండటంతో విషయం తెలుసుకున్న రాష్ట్ర SC సెల్ అధ్యక్షుడు MS రాజు గ్రామంలో కి వెళ్తుండగా బుక్కరాయసముద్రం CI రామారావు, అనంతపురం ఫస్ట్ టౌన్ CI ప్రతాప్ రెడ్డి,ముడవ పట్టన CI రెడ్డెప్ప, బుక్కరాయ సముద్రంSI చంద్రశేఖర్ అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. MS రాజు మాట్లాడుతూ పసుపు సైనికులకు అన్యాయం జరిగితే దేనికైనా వెనకడబోమని తెలియజేసారు.

* అతడు రోజు కూలి చేసి పొట్ట పోసుకుంటాడు. భార్యతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని ఘోరక్‌పూర్ జిల్లా కాంపర్‌గంజ్ గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి వివాహమైంది. కొంత కాలం క్రితం అతడి భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో నాలుగు నెలల కిత్రం ఆమె ప్రియుడితో కలిసి ఇంటినుంది వెళ్లిపోయింది. ఈలోపు భర్త జరిగిన విషయం గ్రామపెద్దకు పోలీసులకు తెలిపాడు. అయితే ఇటీవలే ఆమె భర్త వద్దకు తిరిగొచ్చింది. ఏందుకమ్మా ఇలా చేశావ్ అని అడిగిన పోలీసులు ఆమె చెప్పిన సమాధానం విని నోరెళ్లబెట్టారు.

 * ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జీతాలు లేక ఓవైపు, సమ్మె కష్టాలు మరోవైపు కార్మిక కుటుంబాలను కష్టాలపాలు చేశాయి. పండుగ పూట కూడా కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి. తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 23వ రోజుకు చేరింది.

* దీపావళి రోజు నగరంలో దారుణం జరిగింది. చరణ్ అనే యువకుడు ఆదివారం ఉదయం నగరంలోని డెయిరీ ఫామ్ వద్ద బైక్‌పై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ను లారీ సుమారు మూడు కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో మంటలంటుకుని బైక్ దగ్ధమైంది. బైక్‌పై ఉన్న చరణ్ ఆ మంటల్లో చిక్కుకుని, అగ్నికి ఆహుతయ్యాడు. కాళ్లు, చేతులు చిద్రమయ్యాయి. మంటల తీవ్రతకు శరీర భాగాలు కాలిపోయాయి. డ్రైవర్ లారీని ఆపి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* గిద్దలూరు నల్లబండ బజారులోని ఒక గృహంలో చోరీ 22 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

* చెడ్డి గ్యాంగ్ దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మూడు కమిషనరేట్ల పరిధిలో 10 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. హాయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లురులో వరుసగా మూడు ఇళ్లల్లో ఈ గ్యాంగ్ చోరీ చేసింది. చెడ్డి గ్యాంగ్ సంచరిస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. దీని ద్వారా నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా స్థానికులు భయాందోళనలో ఉన్నారు…

* తాడేపల్లిలో భవననిర్మాణ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన. ఇంటిఇంటికి తిరిగి భిక్షాటన చేసిన భవననిర్మాణ కార్మికులు. తాడేపల్లిలో ఇసుక లేకపోవడంతో పనులు లేక 6 వేల మంది భవననిర్మాణ కార్మికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నాం

* ఖమ్మం : దొంగనోట్లు చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా ఖమ్మం జిల్లా సత్తుపల్లి కేంద్రంగా దొంగనోట్లు చెలామణి చేస్తోంది. సత్తుపల్లి రాజీవ్ నగర్‌లో పాత నేరస్థుడు మధార్ ఇంటి నుంచి రూ. 40 లక్షలు నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 7గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు మధార్  పరారీలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు.

* బంగారుపాళ్యానికి చెందిన ఓ యువతిని చరవాణిలో వేధించిన ఖమ్మం యువకుడిని శనివారం రాత్రి అరెస్టు చేసినట్లు బంగారుపాళ్యం ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంగారుపాళ్యానికి చెందిన ఓ యువతి హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. ఆమెకు ఓ గుర్తుతెలియని వ్యక్తి చరవాణి ద్వారా అసభ్యకరమైన పోస్టులు చేస్తూ తరచూ ఇబ్బందులు పెడుతున్నాడు. ఈ విషయమై ఆమె కొన్నిరోజుల కిందట స్వగ్రామానికి వచ్చిన సమయంలో బంగారుపాళ్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎస్సై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. యువతికి పోస్టులు వస్తున్న చరవాణి నెంబరు ద్వారా నిందితుడిని తెలంగాణలోని ఖమ్మం పట్టణవాసి మహేష్‌ (25)గా గుర్తించారు. తిరుపతిలో శనివారం రాత్రి అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు ఇష్టమొచ్చిన చరవాణి నెంబర్లకు ఫోన్‌ చేసేవాడు.
* డోన్ రూ “2 .25 లక్షల నగదు ,15 తులాల బంగారు ఆభరణాలు చోరి. పట్టణంలోని శ్రీ క్రిష్ణ లాడ్జి వెనుక లక్ష్మి రంగమ్మ అను మహిళ ఇంటికి తాళం వేసి పొలం పనులపై కటారు కొండకు వెళ్లిన మహిళ .ఇంటి తాళం బద్దలు కొట్టి చోరీ కి పాల్పడిన దుండగులు.రూ “2 .25 లక్షల నగదు ,15 తులాల బంగారు ఆభరణాలు చోరి .కేసు నమోదు దర్యాప్తు చేపట్టిన పట్టణ పోలీసులు .

* కాచిగూడ ప్లాట్‌ఫారంపై నడుచుకుంటూ వెళ్తుండగా ప్యాసింజర్ రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేపోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాబుబ్‌నగర్ జిల్లా,దేవరకద్ర మండలం,కౌకుంట్ల గ్రామానికి చెందిన  మెట్ల జయకృష్ణ(26)బీటెక్ పూర్తి చేశాడు. గత రెండు సంవత్సరాలుగా ఐఏఎస్ కోసం కోచింగ్ తీసుకుంటు హాస్టల్ లో ఉంటున్నాడు. మలక్‌పేట రైల్వేస్టేషన్ ప్లాట్ ఫారం-1 అంచున నడుచుకుంటూ వెళ్తుండగా  ప్యాసింజర్ రైలు ఢీకొని జయకృష్ణ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కాచిగూడ రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కాచిగూడ రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

* మోస్ట్‌ వాంటెడ్ టెర్రరిస్ట్, ఇస్లామిక్‌ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐసిస్‌) చీఫ్‌ అబు బకర్‌ ఆల్‌ బగ్దాదీ హతమైనట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. నిన్న సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా బలగాలు భీకర దాడులు జరిపాయి.. ఈ దాడుల్లో బాగ్దాదీ మరణించినట్టు అమెరికా మిలటరీ అధికారులు వెల్లడించారు. భారీ ఘటన జరిగిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. బాగ్దాదీ ఎన్‌కౌంటర్‌పై అమెరికా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఇక, 2010లో ఐసిస్ చీఫ్ బాధ్యతలు చేపట్టారు బాగ్దాదీ.. ఓ రహస్య ఆపరేషన్‌లో బాగ్దాదీని మట్టుబెట్టినట్టు కూడా మరికొన్ని కథనాలు వెలువడ్డాయి. అబు బకర్‌ను మట్టుబెట్టడానికి అత్యున్నత స్థాయిలో వ్యూహరచన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌ను వారం క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా ఆమోదించారని కూడా అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

* జైలు గోడ దూకి నలుగురు దొంగలు పరారైన ఘటన చత్తీస్‌గఢ్‌లోని ముంగేలీ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంగేలీ సబ్ జైలులో ఉన్న నలుగురు ఖైదీలు పక్కా ప్లాన్‌తో తప్పించుకున్నారు. తామున్న బ్యారక్ తాళం పగలగొట్టిన ఖైదీలు.. గదిలో ఉన్న బెడ్ షీట్‌ను తాడులా మార్చుకున్నారు. దాని సాయంతో 20 అడుగుల ఎత్తున్న గోడ దూకి పారిపోయారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి సమయంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నలుగురూ హత్య, దొంగతనం కేసుల్లో అరెస్ట్ అయ్యారని పోలీసుల తెలిపారు. జైలు సిబ్బంది హస్తంపై కూడా విచారిస్తున్నామని చెప్పారు.