దేశవాళీ క్రికెట్‌ను అభివృద్ధి చేయడానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీనే సరైనోడు అని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ‘దేశవాళీ క్రికెట్‌ను అభివృద్ధి చేస్తానని గంగూలీ అన్నాడు. దానికి అతడే సరైనోడు. దేశవాళీ క్రికెట్‌లోని సమస్యలన్నీ అతడికి తెలుసు. టీమ్‌ఇండియాలో స్థానం కోల్పోయినప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడుతూ దేశమంతటా పర్యటించాడు. తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్న తర్వాత దానిలోని లోపాల గురించి చర్చించాడు. ఆటగాళ్లు విఫలమవుతున్నా ఉత్తేజపరుస్తూ వారిలో దాదా ఆత్మవిశ్వాసం నింపేవాడు. దీంతో వారు అద్భుత ప్రదర్శన చేసి జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. నాయకుడిగా అదే అతడి ప్రధానబలం. దాదా తెలివైన సహజసిద్ధ నాయకుడు. అందరి అభిప్రాయాలను గౌరవిస్తాడు. కానీ, ఏది సరైనదని భావిస్తాడో అదే చేస్తాడు’ అని సెహ్వాగ్ తెలిపాడు. అక్టోబర్ 23న దాదా బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో క్రికెటర్‌గా గంగూలీ చరిత్ర సృష్టించాడు.
దేశవాళీకి దాదా ఊతం ఇస్తాడు
Related tags :