Movies

21 ఏళ్ల తర్వాత రమ్యకృష్ణతో

amitabh ramya krishna after 21 years

50 ఏళ్ల సినీ కెరీర్‌లో తొలిసారి ఓ తమిళ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే.. 21 ఏళ్ల తర్వాత రమ్యకృష్ణతో కలసి నటించనున్నారు. అమితాబ్‌ బచ్చన్, యస్‌.జె.సూర్య ముఖ్య పాత్రల్లో తమిళవానన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఉయంర్ద మణిదన్‌’. తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్‌కు జోడీగా రమ్యకృష్ణ కనిపిస్తారు. 1998లో రిలీజైన ‘బడే మియా చోటే మియా’ సినిమాలో అమితాబ్‌– రమ్యకృష్ణ జోడీగా కనిపించారు. 21 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది.