ఇప్పుడిప్పుడే చలి మొదలవుతోంది. చర్మం పొడిబారడం ఈ సమయంలో ఎదురయ్యే సర్వసాధారణ సమస్య. దీన్ని అదుపులో ఉంచాలంటే ఇప్పటినుంచీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి మరి.
* వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడి నీటితో స్నానం చేయాలని అనిపించడం సర్వసాధారణమే అయినా.. గోరువెచ్చని నీటిని ఎంచుకోవడమే మంచిది. ముఖం కడుక్కున్నా, స్నానం చేసినా వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవడమూ తప్పనిసరే. దానివల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.
* కాళ్లు, చేతులు పొడిబారకుండా ఉండేందుకు గ్లిజరిన్, పెట్రోలియం జెల్లీ ఉండే ఉత్పత్తులను ఎంచుకోవాలి. ముఖ్యంగా వారానికోసారి వాటిపై పేరుకొన్న మృతకణాలు తొలగించుకోవాలి.
* ఎండ ఉన్నా లేకపోయినా… సన్‌స్క్రీన్‌ని తప్పనిసరిగా రాసుకోవాలి. ఇది చర్మంపై ఎండ ప్రభావం పడకుండా చేస్తుంది. చలికాలమైనా సరే… బయటకు వెళ్తున్నప్పుడు చలువకళ్లద్దాలు పెట్టుకోవడం మరవకండి.
* చర్మం పొడిబారకుండా ఉండాలంటే… రెండు లేదా మూడు రోజులకోసారి ఆలివ్‌నూనెను ముఖం, కాళ్లు, చేతులకు పట్టించి మర్దన చేసుకోండి. అరగంటయ్యాక స్నానం చేస్తే చాలు. చర్మం తాజాగా, మృదువుగా మారుతుంది.
* ఈ సమయంలో దాహం వేసినా వేయకపోయినా… నీళ్లు బాగా తాగాలి. సూప్‌లు, నీటిశాతం ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడమూ ముఖ్యమే.
శీతాకాలం పొడిచర్మంపై పోరాటానికి చిట్కాలు
Related tags :