ప్రాణాంతకమైనమలేరియా బ్యాక్టీరియా ఒకప్పుడు దోమల్లో కాకుండా ఆఫ్రికన్ గొరిల్లాల్లోనేజీవించేదట. గొరిల్లాలకు మనుషులు కాస్త దూరం కాబట్టి అప్పట్లో మలేరియా ముప్పుఉండేది కాదట. అయితే.. 50 వేల ఏండ్ల కిందట మలేరియా పారాసైట్లోనిజీన్స్కు జరిగిన మార్పులే ఇప్పుడు మనుషుల ప్రాణాల మీదికి వచ్చిందని బ్రిటన్లోనివెల్కమ్ సేంజర్ ఇనిస్టిట్యూట్ రీసెర్చర్లు వెల్లడించారు. మలేరియా జ్వరం వల్లఏటా వందల మంది బలి అయిపోతున్నారు. వాస్తవానికి నాలుగు రకాల పారాసైట్ల వల్ల మలేరియావస్తుంది. కానీ.. ప్లాస్మోడియం ఫాల్సిపారం రకం పారాసైట్ మన వంట్లోకి చేరితే మాత్రంప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అప్పట్లో గొరిల్లాల్లోనే ఈ ప్లాస్మోడియంఫాల్సిపారం బ్యాక్టీరియా ఉండేది. అంటేఇవి దోమల్లో జీవించేవి కావు. అందుకే దోమకాటు వల్ల ఇది మనుషులకు వ్యాపించే అవకాశంఉండేది కాదు. సుమారు 50 వేల ఏండ్ల కిందట ప్లాస్మోడియంఫాల్సిపారంలో జన్యు మార్పు జరగడం వల్ల అదిగొరిల్లాలను వదిలి అనాఫిలస్ దోమల్లో జీవించేందుకు అనుకూలంగా మారిపోయిందట. అప్పట్లోఒక గొరిల్లాకు ఒకే సమయంలో ఫాల్సిపారంతో పాటు వేరే రకానికి చెందిన ప్లాస్మోడియంపారాసైట్ సోకి ఉంటుందని, అప్పుడు రెండింటి మధ్య డీఎన్ఏ పదార్థంమార్పిడి జరిగి ఉంటుందని సేంజర్ ఇనిస్టిట్యూట్ రీసెర్చర్ల టీం చీఫ్ డాక్టర్గేవిన్ రైట్ తెలిపారు. దీనివల్ల ఫాల్సిపారం డీఎన్ఏలోకి ఆర్ హెచ్5 అనే జీన్ కొత్తగా రావడంతో ఆ పారాసైట్దోమల్లో నివసించేందుకు అనుకూలంగా మారిందన్నారు. మలేరియా పారాసైట్కు చెందినరెండు పురాతన రకాలపై పరిశోధనలు చేయగా ఈ విషయం తెలిసిందన్నారు. అయితే, ఫాల్సిపారంలోని ఆర్ హెచ్5 జీన్ను కంట్రోల్ చేసేలా కొత్తటీకాలు తయారు చేస్తే.. మలేరియాను నిర్మూలించేందుకు వీలవుతుందని, అందుకే ఈ జీన్ పై మరింత రీసెర్చ్చేస్తున్నామని సైంటిస్టులు పేర్కొన్నారు.
మనుషుల మలేరియా గొర్రిల్లాల నుండి వచ్చింది
Related tags :