ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ ఓ గుడిలో పూజారి చేతిలో కొరడా దెబ్బలు తిన్నారు. సోమవారం గోవర్ధన పూజ పురస్కరించుకొని సీఎం ఓ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆలయ సంప్రదాయం ప్రకారం అమ్మవారి ఎదుట పూజారి చేతిలో కొరడా దెబ్బలు తింటే మంచిదని స్థానికుల నమ్మకం. విషయం తెలుసుకున్న సీఎం తానూ కొరడా దెబ్బలు తిన్నారు. ఆలయ పూజారి సైతం సీఎంను సామాన్య భక్తుడిగానే భావించి కొరడా ఝుళిపించారు. ఆరు కొరడా దెబ్బలు తిన్న తర్వాత సీఎం ఇక చాలు అన్నట్లు చేతిని వెనక్కి తీసుకున్నారు. కొరడాతో కొడుతున్పప్పుడు సీఎం సంతోషంగా కనిపించారు. కొరడాతో కొట్టడానికి ముందు, కొట్టిన తరువాత పూజారి సీఎంకు నమస్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి పూజారిని ఆత్మీయంగా అలింగనం చేసుకుని గుడి నుంచి బయటకు వెళ్లారు.
ముఖ్యమంత్రికి కొరడా దెబ్బల ఆశీర్వచనం
Related tags :