గత కొద్ది సంవత్సరాల నుండి భాజపా పార్టీలో కీలక పాత్ర పోషించిన మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి కేంద్రంలో మంత్రి పదవి లభించే సంకేతాలు వెలువడుతున్నాయి. లేనిపక్షంలో ఆమెకు సహాయమంత్రి హోదా కలిగిన ఒక కీలక పదవి లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ కుమార్తె కావడంతో పాటు కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం ఇంగ్లిష్, హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడం పురందేశ్వరికి మరో సారి కేంద్రంలో కీలక పాత్ర పోషించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ చెంచురామ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజవకర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్ధి ఏలూరి సాంబశివరావుపై ఓటమి చెందారు. గత కొద్ది రోజుల క్రితం పర్చూరు నియోజకవర్గ బాధ్యతల నుండి దగ్గుపాటి వెంకటేశ్వరరావును తప్పించి గతంలో నియోజకవర్గం వైఎస్సార్‌సిపి ఇంఛార్జిగా ఉన్న రావి రామనాధం బాబును తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి తీసుకోవటం జరిగింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ దగ్గుపాటి వెంకటేశ్వరరావుతో మాట మాత్రమైనా చర్చించలేదు. దాని తరువాత దగ్గుపాటి వెంకటేశ్వరరావు జగన్‌ను కలవటం జరిగింది.వారిద్దరి భేటీ అనంతరం భార్యా భర్తలు ఇరువురు ఒక పార్టీలో చేరితే బాగుంటుందని దగ్గుపాటి పురంధేశ్వరి వైఎస్సార్ సిపిలో చేరితే తగిన ప్రాధానత్య కల్పిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెప్పినట్లు తెలిసింది. కానీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు అవసరమైతే రాజకీయాలకు దూరమవుతారు. తన భార్య పురంధేశ్వరి బిజెపిలోనే కొనసాగుతారని తన సన్నిహితులకు తెలిపారు. 2014లో రాజంపేట ఎంపీగా, 2019లో విశాఖపట్నం ఎంపీ అభ్యర్ధిగా ఓడిపోయిన మాజీ మంత్రి పురంధేశ్వరిపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి, అమిత్ షాలకు సానుభూతి ఉంది.దివంగత నేత ఎన్టీఆర్ కుమార్తె కావటంతో ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఏపిలో తెలుగుదేశం పార్టీని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టేందుకు రంగం సిద్దమైంది.తన భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు జగన్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి తప్పు చేశారని పురంధేశ్వరి సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఏది ఏమైనా దగ్గుపాటి పురంధేశ్వరి సేవలు ఆంధ్రప్రదేశ్‌లో అవసరమని నరేంద్రమోడీ, అమిత్ షాలు గుర్తించారట. ఇదే విషయంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని పురంధేశ్వరి కలిశారని, ఆమెను బిజెపిని వదలి పోవద్దని ఆయన సూచించారని ఆమె సన్నిహతుల ద్వారా బయటకు పొక్కింది. తాను అవసరమైతే జగన్ పార్టీని వదిలేస్తానని,పురంధేశ్వరి రాజకీయ భవిష్యత్తుకు తాను అడ్డం కాకూడదని నిర్ణయం తీసుకున్నానని సన్నిహితులతో దగ్గుపాటి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
పురంధేశ్వరికి కేంద్రంలో కీలక పదవి…దగ్గుబాటి నిష్క్రమణ
Related tags :