Movies

దర్శకత్వ కలలు

I dream of direction-Anupama Parameswaran

కెప్టెన్ కుర్చీకి దగ్గరవుతోంది. ఆమె నటిస్తున్న ఒక మలయాళ చిత్రం కోసం సహాయ దర్శకురాలిగా మారింది. నటిగా కెమెరా ముందు ఉండటం ఆమెకి ఎంత ఇష్టమో, కెమెరా వెనక సాంకేతికతని తెలుసుకోవడంపైనా ఆమె అంతే ఇష్టం ప్రదర్శిస్తుంటారు. అందులో భాగంగానే ఆమె సహాయ దర్శకురాలిగా కొత్త అవతారమెత్తారు. ‘‘ఒకేసారి రెండు పనులు చేయలేను. అందుకే సినిమాల్లో అవకాశాలు వచ్చాక చదువుకి దూరమయ్యా. సినిమా సెట్లో మాత్రం నా ఆలోచనలు మారిపోతుంటాయి. వంద పనులైనా చేయగలనేమో అనేంత ధైర్యం వస్తుంటుంది. సినిమా అంటే ఇష్టం కాబట్టే అన్ని విషయాల్నీ నేర్చుకొనేలా చేస్తుందేమో. కెమెరా ముందు నటించడం పూర్తవ్వగానే… వెనకాల ఎవరెవరు ఎలా కష్టపడుతున్నారో గమనిస్తుంటా. దర్శకత్వం గురించి నేను చాలా కలలే కంటున్నా. అది ఎప్పుడు నెరవేరుతుందో మరీ’’ అంటోంది అనుపమ.