కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్.
ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లాలో తన భార్య పేరిట స్థిరాస్థి కొనుగోలు విషయాలను ఇటీవల కొనుగోలు చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్న సీఈవో.
తన భార్య ప్రైవేటు టెలికాం సంస్థలో ఉన్నతస్థాయిలో పనిచేస్తూ పొదుపు డబ్బులతో స్థిరాస్థి కొనుగోలుచేశానని, ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్ జరిగిందని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన రజత్‌కుమార్.
ఎన్నికల ప్రధాన అధికారిగా ఉండి ఒక రాజకీయపార్టీకి అనుకూలంగా వ్యవహరించారంటూ వ్యక్తిగత ప్రతిష్టతను దెబ్బతీస్తున్నారని వెల్లడి.
కొందరు వ్యక్తులు, కొన్ని శక్తులు తన విధులకు అపార్ధాలు ఆపాదిస్తూ కుటుంబప్రతిష్టతను దిగజారుస్తున్నారని విచారం.
అలాంటి పోస్టింగ్‌లతో వ్యక్తిగతంగా తనను, తన కుటుంబాన్ని మానసిక ఆవేదనకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన రజత్‌కుమార్.