ఆడవారి పరిశుభ్రతా అలవాట్లతో కొన్నిరకాల క్యాన్సర్లకు సంబంధమున్నట్టు తాజా పరిశోధనలో తేలింది. వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్లు (వీవోసీ) క్యాన్సర్కు దారితీస్తాయి. జననావయవాన్ని సౌందర్య ద్రవాలతో కడగడం; కాస్మొటిక్ పౌడర్లు అద్దడం వంటి అలవాటున్నవారి రక్తంలో… ఈ వీవోసీ స్థాయులు అధికంగా ఉంటున్నట్టు రూఢి అయింది. యువతులు, మహిళలు సాధారణంగా టాంపన్లు, శానిటరీ న్యాప్కిన్లు, స్ప్రేలు, వైప్స్ వంటి వాటిని వాడుతుంటారు. ఈ సాధనాల్లోని రసాయనాలు.. వారిలో నాడీ, శ్వాసకోశ, పునరుత్పత్తి వ్యవస్థలపై ప్రభావం చూపడమే కాకుండా, క్యాన్సర్లకూ కారణమవుతున్నట్టు ఈ పరిశోధనలో వెల్లడైంది. సర్వే ద్వారా… 20-49 ఏళ్ల వయసున్న 2,432 మంది మహిళల ఆరోగ్య వివరాలను పరిశోధకులు సేకరించారు. వారి రక్త నమూనాలను పరీక్షించగా ‘1, 4-డైకోరోబెంజీన్’ అనే వీవోసీలు ఉన్నట్టు తేలింది. ‘‘కాస్మొటిక్ ద్రవాలతో జననావయవాలను శుభ్రం చేసుకునేవారి రక్తంలో మిగతా మహిళల కంటే సగటున 18% అధికంగా క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. నెలలో రెండుసార్లు కంటే ఎక్కువగా ఇలా చేసేవారికి క్యాన్సర్ ముప్పు 81% ఎక్కువగా ఉంటోంది’’ అని పరిశోధకులు తెలిపారు.
కాస్మెటిక్స్తో క్యాన్సర్ ముప్పు
Related tags :