* జగన్ ప్రభుత్వం వచ్చి 5నెలలు అవుతున్నా ప్రజలకి ఏంకావాలో చూడకుండా టిడిపి నాయకులపై కక్ష సాదింపు కొనసాగిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జైల్లో చింతమనేని ప్రభాకర్ ను లోకేష్ పరామర్శించారు. అనంతరం చింతమనేని గృహానికి చేరుకుని కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో టిడిపి కార్యకర్తలపై 610కేసులు న మోదయ్యాయన్నారు. ఈరోజు వరకు 18 మంది నాయకులపై పై కేసులతో వేదిస్తున్నారని అన్నారు. గతంలో ఇదే జగన్ ముఖ్యమంత్రిని కాల్చి చంపాలి అన్నారు. ఇపుడు సియం డౌన్ డౌన్ అంటే అరెస్టులు చేసేసి వేదిస్తున్నారని విమర్శించారు. వల్లభనేని వంశీని కేసులపేరుతో వేదింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రజా ధనాన్ని జీతంగా తీసుకుంటూ సజ్జల రామకృష్టా రెడ్డి టిడిపి నేతలపై కేసులు ఏరకంగా పెట్టాలనే దానిపైనే పని చేస్తున్నారని ఆరోపించారు. చింతమనేని ప్రభాకర్ సొంత సొమ్ముతో నియెాజక వర్గాన్ని అభివృద్ధి చేసారన్నారు. అలాంటి వ్యక్తిపై ప్రభుత్వం వచ్చాక 12కేసులు పెట్టారని అన్నారు. ఎవరో వీడియెాలు మార్ఫింగ్ చేసి పెడుతుంటే వాటిపై కేసులు పెడుతున్నారని . గతంలో టిడిపి అలాంటి నిర్ణయాలు తీసుకుంటే వైసిపి నేతలు రోడ్డుపై తిరగగలిగేవారా అని ప్రశ్నించారు.
*తెలంగాణ ఆర్టీసీ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి వర్గం శనివారం సమావేశం కానుంది. ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది.
* అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తిరువనంతపురంకు 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కొంకణ్, గోవా, కర్ణాటక ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తాయని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
* రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండురోజుల పాటు తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ కేంద్రం గురువారం వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
* ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌పై మరో కేసు నమోదుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈఎస్ఐ మెడికల్ స్కాం కేసులో 16 మందిని అరెస్ట్ చేశారు.
* కాకినాడ రూరల్ రేపూరు గ్రామంలో భవననిర్మాణ కార్మికులకు మద్దతుగా చలో వైజాగ్ కార్యక్రమ పోస్టర్ ని కార్మికుల సమక్షంలో కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఆవిష్కరించారు.
* మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు ఇందిరాగాంధీకి నివాళులర్పించారు. ఇక్కడి ఇందిరా గాంధీ మెమోరియల్‌లో జరిగిక ప్రార్థనల్లో వారు పాల్గొన్నారు
* జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఇవాళ ఉదయం తమిళనాడులోని కోయంబత్తూరులో మూకుమ్మడి సోదాలు చేపట్టారు. ఓ ఉగ్రవాద ముఠాతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులకు చెందిన ఇళ్లలో సోదాలు నిర్వహించినట్టు పోలీసులు వెల్లడించారు. ఉగ్రదాడులకు కుట్రపన్నడం, నిధులు చేరవేయడం, ఇస్లాం రాజ్యాన్ని స్థాపించడం కోసం భారత్‌లో దాడులకు ఏర్పాట్లు చేయడం సహా పలు అభియోగాలు ఈ ముఠాపై ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
*వ్యవసాయ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు వ్యవసాయ రంగం అభివృద్దికి తోడ్పడేలా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ యం.వి.ఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు.
*మహబూబాబాద్ జిల్లాలో వింత సంఘటన జరిగింది. గూడూరు మండలం నాయక్ పల్లి గ్రామంలో ఓ పందికి ఏనుగు ఆకారంలో ఉన్న రెండు పిల్లలు పుట్టాయి. ఏనుగు లాగ తొండం కలిగి ఉండడం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు.
*జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మార్చ్ ఫాస్ట్ కు భవన నిర్మాణ కార్మికులoతా తరలిరావాలని ఈ సందర్భంగా నానాజీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
*కాకినాడ రూరల్ రేపూరు గ్రామంలో భవననిర్మాణ కార్మికులకు మద్దతుగా చలో వైజాగ్ కార్యక్రమ పోస్టర్ ని కార్మికుల సమక్షంలో కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఆవిష్కరించారు.
*జమ్ముకశ్మీర్ చరిత్రలో సరికొత్త శకం ప్రారంభమైంది. ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లు ఆగస్టు 5న పార్లమెంట్ ఆమోదం పొందిన నేపథ్యంలో అర్ధరాత్రి జమ్ముకశ్మీర్, లద్దాఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించాయి. ఒకే దేశం… ఒకే రాజ్యాంగం ప్రక్రియ అమల్లోకి వచ్చింది. లద్దాఖ్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా రాధాకృష్ణ మాథుర్ లేహ్‌లో ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా గిరీష్ చంద్ర ముర్ము మధ్యాహ్నం ప్రమాణం చేస్తారు.
*రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్లో ఆర్టీసీ సమ్మెపై సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఇన్ఛార్జి ఎండీ సునీల్శర్మ, కమిషనర్ సందీప్ సుల్తానియా, అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
*నవంబరు 1 నుంచి 24వ తేదీ వరకు టర్నర్ చౌల్ర్టీలో విశాలాంధ్ర పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు విశాలాంధ్ర బుక్హౌస్ మేనేజర్ పీఏ రాజు తెలిపారు.
*ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య వారాంతపు ప్రత్యేక రైలు నడపాలని తూర్పు కోస్తా రైల్వే నిర్ణయించింది. ఈ రైలు నవంబరు రెండవ తేదీ నుంచి 30వ తేదీ వరకు నడుస్తుంది.
*సెరికల్చర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది మే 28,29 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు డిసెంబర్ 6న ఇంటర్వ్యూలు జరుగుతాయని ఏపీపీఎస్సీ సెక్రెటరీ పీఎ్సఆర్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. మెయిన్స్ ఫలితాల నోటిఫికేషన్ https://psc.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు ఆయన పేర్కొన్నారు.
*కృష్ణాజిల్లా గుంటుపల్లిలోని 1100 కాల్ సెంటర్ కార్యాలయం వద్ద ఉద్యోగినుల ధర్నా..పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్…గత కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన..
*ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌పై మరో కేసు నమోదుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈఎస్ఐ మెడికల్ స్కాం కేసులో 16 మందిని అరెస్ట్ చేశారు.
* ఆసీస్ ఆటగాడు మాక్స్‌వెల్ సంచలన నిర్ణయంఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతడు ఉన్నట్టుండి అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం ప్రకటించాడు. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగానే మాక్స్‌వెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సైకాలజిస్ట్ డాక్టర్ మైఖెల్ తెలిపారు.
*ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. బుధవారం విజయవాడ ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ ఆసుపత్రి ప్రాంగణంలో కార్మికుల వసతి గృహం ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు.
* సీపీఐ సీనియర్ నాయకుడు గురుదాస్ దాస్‌గుప్తా(83) కన్నుమూశారు. కోల్‌కతాలో గురువారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.
*రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థలపై వాస్తవ స్థితిగతులను సమీక్షించి, వాటిపై ప్రభుత్వానికి నివేదిస్తామని ఈ సంస్థల శాసనసభాకమిటీ (పీయూసీ) ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి తెలిపారు.బుధవారం ఆయన శాసనసభా ప్రాంగణంలోని తన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు.
*జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు త్వరలో పూర్తి అధికారాలు సంక్రమించేలా చర్యలు తీసుకుంటామని.. దీనిపై సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
*భద్రాచలం పుణ్యక్షేత్రంలోని అన్ని వీధుల్లో ప్లాస్టిక్ లేకుండా ప్రతీ ఒక్కరు చొరవ తీసుకోవాలని జేడీ(జాయిన్ ఫర్ డెవలప్మెంట్) ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ సూచించారు.
*వికారాబాద్ జిల్లా పాత తాండూరులోని ఓ పురాతన ఇంటిని కూల్చివేస్తుండగా సుమారు 500 వెండి నాణేలు బయటపడ్డాయి. స్థానిక హనుమాన్ దేవాలయం సమీపంలోని ఓ ఇంటిని యజమానులు నాలుగేళ్ల కిందట విక్రయించారు.
*నీటిపారుదల శాఖ మహబూబ్నగర్ జిల్లా చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్ట్స్)గా ఎల్.అనంతరెడ్డి నియమితులయ్యారు. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా.శైలేంద్ర కుమార్ జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
*తెలంగాణలో గత అయిదేళ్లలో ధాన్యం కొనుగోళ్లు 318 శాతం పెరిగినట్లు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ ఎం.శ్రీనివాసరెడ్డి, కమిషనర్ అకున్ సబర్వాల్ చెప్పారు.
*నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసే అవకాశముంది. ఇక్కడ 100ఎకరాల భూమి అందుబాటులో ఉండటంతో అక్కడ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
*వైఎస్ఆర్ రైతు భరోసాలో ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా బోరు బావుల తవ్వకం కోసం యంత్రాల సమీకరణకు పిలిచిన టెండర్లపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
*ఆంధ్రప్రదేశ్లో 30 వన్ధన్ వికాస కేంద్రాలకు కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ అనుమతించింది. బుధవారమిక్కడ గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య (ట్రైఫెడ్) ఎండీ ప్రవీణ్ కృష్ణ మాట్లాడుతూ.. గిరిజన వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి వన్ధన్ పథకం ఏర్పాటు చేశామన్నారు.
*ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు సకాలంలో తమకు రుణ వాయిదాలు చెల్లించడం లేదని, ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని రాష్ట్ర ప్రభుత్వానికి హడ్కో లేఖ రాసింది.
*విజయవాడలో నవంబరు 4న ఇసుక సత్యాగ్రహాన్ని నిర్వహించనున్నట్లు భాజపా ఉపాధ్యక్షుడు తురగా నాగభూషణం వెల్లడించారు. నవంబరు 10న విజయవాడలో జరిగే పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల మహాసభకు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీనడ్డా హాజరవుతారని పేర్కొన్నారు.
*ఏపీ మానవ హక్కుల కమిషన్ను 4 నెలల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కె.విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. సర్కారు తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. 3 నెలల్లో కమిషన్ను తిరిగి ఏర్పాటు చేస్తామన్నారు
* రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు ఐటీ సలహాదారులకు మార్చి, 2020తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి అవసరమైన గౌరవ వేతనం చెల్లింపులకు రూ.1.03 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు లిచ్చింది. కె.రాజశేఖర్రెడ్డి (పాలసీ, పెట్టుబడులు), జె.విద్యాసాగర్రెడ్డి (టెక్నికల్), శ్రీనాథ్ దేవిరెడ్డి(టెక్నికల్)ని ప్రభుత్వం సలహాదారులుగా నియమించింది.
*సెరికల్చర్ ఉద్యోగ నియామకాల భర్తీకి సంబంధించిన మౌఖిక పరీక్షలు డిసెంబరు 6న విజయవాడ ఏపీపీఎస్సీ కార్యాలయంలో జరగనున్నాయి. ప్రధాన పరీక్ష ద్వారా మౌఖిక పరీక్షకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది.
*సర్దార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నేడు ఐక్యతా దివస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
*రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కేంద్ర మంత్రులు అమిత్ షా, హర్‌దీప్ సింగ్ పురి, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజర్‌తో కలిసి దిల్లీలోని పటేల్ చౌక్ వద్ద సర్దార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
చింతమనేనిని జైలులో కలిసిన చినబాబు-తాజావార్తలు-10/31
Related tags :